Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సమస్యలపై స్పందించేంత వరకు పోరాటం

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:04 AM

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించేంతవరకు తమ పోరాటం ఆగదని తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన నిరవధిక నిరాహారదీక్షకు చేపట్టారు.

సమస్యలపై స్పందించేంత వరకు పోరాటం

విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

విద్యాధరపురం, మార్చి 3 : విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించేంతవరకు తమ పోరాటం ఆగదని తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్‌ చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆటోనగర్‌లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన నిరవధిక నిరాహారదీక్షకు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించలేని ప్రభుత్వం.. సిద్ధం సభలకు రూ.800 కోట్లు ఖర్చుచేయడం దారుణమన్నారు. 2019లో పీజీ చేసిన విద్యార్థులకు జీవో 77 సాకుగా చూపి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించే జీవో 77ను రద్దు చేయాలన్నారు. రూ.2750 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, టీడీపీ అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లు శ్రావణ్‌కు సంఘీభావం తెలిపారు. సకాలంలో బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజును విద్యార్థులే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, కళాశాలలకు వెళ్లలేక విద్యార్థులు సతమతమవుతున్నారన్నారు. దీక్షకు టీడీపీ యువత మద్దతు తెలిపింది.

Updated Date - Mar 04 , 2024 | 01:04 AM