Share News

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:38 AM

ప్రజారవాణా సంస్థలో హైర్‌ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనం రూ,26 వేలు అందించాలని అద్దెబస్సు డ్రైవర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తులసీరామ్‌ డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు కనీస వేతనం ఇవ్వాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న తులసీరామ్‌

తిరువూరు, ఏప్రిల్‌ 2: ప్రజారవాణా సంస్థలో హైర్‌ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు కనీస వేతనం రూ,26 వేలు అందించాలని అద్దెబస్సు డ్రైవర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తులసీరామ్‌ డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం తిరువూరు డిపో హైర్‌ బస్సు డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ప్రజారవాణా సంస్థ యాజమాన్యం ఒప్పదం ప్రకారం వేతనాలు అందించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను నోటీసు బోర్డులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. 2012 నుంచి కనీస వేతన చట్టం సవరణ చేయకుడా ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో కనీస వేతన చట్ట అమలు చేస్తేమని పెట్టాలన్నారు. ఎండీ కరిముల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో బలగాని వెంకటేశ్వరరావు, మధుబాబు, సుదాకర్‌, శివ, రాధాకృష్ణ, ఎస్‌.వి.భద్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:38 AM