రూ. కోటి టోకరా కేసులో... వైసీపీ నేత సహా ముగ్గురిపై కేసు
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:56 AM
ఉద్యోగాలు, స్థలా లు ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలకు పైగా మోసం చేసిన వైసీపీ నాయకుడు షేక్ అహ్మద్‌తో పాటు లాయర్ టి.వెంకట రమణరావు, అతని అసిస్టెంట్ కిషోర్‌పై శనివారం భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమో దైంది.
విద్యాధరపురం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు, స్థలా లు ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలకు పైగా మోసం చేసిన వైసీపీ నాయకుడు షేక్ అహ్మద్‌తో పాటు లాయర్ టి.వెంకట రమణరావు, అతని అసిస్టెంట్ కిషోర్‌పై శనివారం భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమో దైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలం, జంగాలపల్లికి చెందిన లింగం సరళాదేవి స్ధానికంగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఈమెకు ఏలూరు జిల్లా, పాతూరులో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న జెల్లూరి రామలక్ష్మితో అయిదేళ్ల నుంచి పరిచయం ఉంది. 2022 సెప్టెంబరులో రామలక్ష్మి తనకు విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు షేక్ అహ్మద్‌తో ఓ వివాహ వేడుకలో పరిచయమైందని, అహ్మద్‌కు రాజకీయ పలుకుబడి ఉండటంతో జిల్లా కోర్టులో జాబులు ఇప్పిస్తానని సరళాదేవికి తెలిపింది. దీంతో వారిద్దరూ విజయవాడ వచ్చి అహ్మద్ ద్వారా లాయర్ టి.వి.రమణరావును, అతని అసిస్టెంట్ కిషోర్‌ను కలిసి ఉద్యోగ వివరాలు తెలుసుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.12 లక్షలు, క్లర్క్ పోస్టుకు రూ.10 లక్ష లు చెల్లిస్తే జాబులు వస్తాయని బాధితులకు నమ్మకంగా తెలిపారు. వారి ఒప్పందం ప్రకారం సరళాదేవి రూ.5 లక్షలు, రామలక్ష్మి రూ.5 లక్షలు చెల్లించి మిగిలిన డబ్బులు ఉద్యోగాలు వచ్చాక చెల్లిస్తామన్నారు. జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యాక దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని, నేరుగా ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికారు. అందులో భాగంగా సరళాదేవి నుంచి రూ.5 లక్షలు, రామలక్ష్మికి జాబుతో పాటు ఆమె భర్తకు విజయవాడలో చికెన్ షాపు ఏర్పాటు చేయిస్తామని వారి వద్ద నుంచి మొత్తం రూ.22,50,000 అహ్మద్ తీసుకున్నాడు. 2023 నవంబరులో బాధితురాలు రామలక్ష్మి, ఆమె కుమారుడికి జూనియర్ అసి స్టెంట్ ఉద్యోగాలు వచ్చినట్లుగా అహ్మద్ ఓ సెల్‌ఫోన్ నుంచి బాధితులకు ఆర్డర్ పత్రాన్ని వాట్సాప్‌లో పంపించి, మిగిలిన డబ్బులు కూడా పంపిం చాలని మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితులు వేర్వేరుగా రూ.5,50,000 అహ్మద్ భార్య బ్యాంక్ అకౌంట్‌కు పంపించారు. రామలక్ష్మి తన కుమా రుడు ఉద్యోగ నిమిత్తం రూ.14 లక్షలు అహ్మద్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేసింది. చికెన్‌షాపు కోసం రామలక్ష్మి మరో రూ.16 లక్షలు అహ్మద్ భార్య ఫోన్‌పేకి, రూ.8 లక్షల నగదును కుమ్మరిపాలెం సెంటర్‌లో ఉం టున్న అహ్మద్ ఇంటికి వెళ్లి ఇచ్చారు. అహ్మద్ చెప్పినట్టుగానే రామలక్ష్మి, ఆమె భర్త విజయవాడలో చికెన్ షాపు పెట్టటానికి భవానీపురం వచ్చి ఉం టున్నారు. ఉద్యోగాలు, చికెన్ షాపు ఏర్పాటు చేయించకపోవటంతో పలుసార్లు అహ్మద్, వెంకట రమణరావు, కిషోర్‌ను అడిగితే కాలయాపన చేస్తున్నారు. గట్టిగా ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో సరళాదేవి తమను మోసంచేసిన ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది.