Share News

రోడ్డు ఏర్పాటు చేయాలని రాస్తారోకో

ABN , Publish Date - May 23 , 2024 | 12:25 AM

ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలంటూ బందరు రోడ్డుపై ప్రొద్దుటూరు గ్రామస్థులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు బందరు రోడ్డుపై నిలి చిన మరమ్మతు పనులను ఇటీవల ప్రైవేటు సంస్థ రూ. 33 కోట్లతో చేపట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు అడ్డ రోడ్డు వద్ద గ్రామంలోకి వెళ్లే కటింగ్‌ను రోడ్డు కాంట్రాక్ట్‌ సిబ్బంది మూసి వేశారు. దీంతో ప్రొద్దుటూరు గ్రామస్థులు బందరు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు.

 రోడ్డు ఏర్పాటు చేయాలని రాస్తారోకో
బందరురోడ్డుపై రాస్తారోకో చేస్తున్న ప్రొద్దుటూరు వాసులు

కంకిపాడు, మే 22 : ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలంటూ బందరు రోడ్డుపై ప్రొద్దుటూరు గ్రామస్థులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు బందరు రోడ్డుపై నిలి చిన మరమ్మతు పనులను ఇటీవల ప్రైవేటు సంస్థ రూ. 33 కోట్లతో చేపట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు అడ్డ రోడ్డు వద్ద గ్రామంలోకి వెళ్లే కటింగ్‌ను రోడ్డు కాంట్రాక్ట్‌ సిబ్బంది మూసి వేశారు. దీంతో ప్రొద్దుటూరు గ్రామస్థులు బందరు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, వ్యవ సాయ ఆధారిత గ్రామాలైన ప్రొద్దుటూరు, బొడ్డపాడు, పులపాక గ్రామాలకు చెందిన పంటలను ప్రొద్దుటూరు గ్రామం నుంచి తరలించాల్సి ఉంటుంది. ప్రొద్దుటూరు అడ్డ రోడ్డు మూసివేయడంతో ఆయా గ్రామాల ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బం దులు పడాల్సి ఉంటుందన్నారు. కిలో మీటర్‌ మేరకు ప్రయాణించి తిరిగి రావాల్సి ఉంటుందని ఆవేద వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు అడ్డ రోడ్డు వద్ద గ్రామంలోకి తిరిగేందుకు అవసరమైన జంక్షన్‌ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 12:25 AM