Share News

స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:48 AM

భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ తప్పక పాటిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌటింగ్‌ కేంద్రాలను మంగళవారం ఆయన, సీపీ కాంతిరాణా, జేసీ పి.సంపత్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు.

స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు
స్ట్రాంగ్‌ రూం ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు, తదితరులు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 27 : భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తు.చ తప్పక పాటిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌటింగ్‌ కేంద్రాలను మంగళవారం ఆయన, సీపీ కాంతిరాణా, జేసీ పి.సంపత్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ, తిరువూరు, నందిగామ, నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు నోవా కళాశాల.. జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, మైలవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు నిమ్రా కళాశాలను ప్రతిపాదించినట్టు ఆయన తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలకు చేర్చి ఽభద్రపరచడం, వాటిని కౌంటింగ్‌ కేంద్రాలకు చేర్చడం, కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్‌ కేంద్రం లే అవుట్‌ ప్రకారం 28 టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. నిరంతరం సీసీ కెమేరాల నిఘాతో పాటు ప్రత్యేక సాయుధ బలగాల ప్రహారా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎస్‌.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్‌డీవో బీహెచ్‌ భవానీశంకర్‌, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ జి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ, పోలీస్‌ పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:48 AM