Share News

రెవెన్యూ మెలిక !

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:19 AM

రాష్ట్ర పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు కేటాయిం చిన భూములను అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు.

రెవెన్యూ మెలిక !

రాష్ట్ర పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు భూములు అప్పగించకుండా సాగదీస్తున్న అధికారులు

పంచాయతీ అనుమతి కావాలంటూ కొర్రీ

అధికార పార్టీ నేతల అక్రమ మైనింగ్‌ కోసమేనా ?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాష్ట్ర పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు కేటాయిం చిన భూములను అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. రెవెన్యూ చుట్టూ పోలీసు శాఖ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు గన్నవరం మండలం వెదురుపావులూరులో కొండ భూమిగా ఉన్న సర్వే నెంబర్‌ 717(పీ)లో ఐదెకరాలను ఎప్పుడో కేటాయించారు. ఈ భూములను స్వాధీనం చేయాల్సిన రెవెన్యూ అధికారులు చాలాకాలంగా అంతు లేని తాత్సారం చేస్తూ వచ్చారు. ఈ భూములను రాష్ట్ర పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌కు కేటాయించకపోవటంపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ఇటీవల గన్నవరం మండలంలో కొండలు, గుట్టలు, చెరువులు ఇలా ఏది పడితే దానిని కొట్టేస్తూ మైనింగ్‌ మాఫియా పేట్రేగిపోతోందని అందరికీ తెలిసిందే. ఈ పాపంలో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు అనేకమొచ్చాయి. పోలీసు ట్రైనింగ్‌ అకాడమీ కోసం కేటాయించిన భూములపైనా అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కన్నుపడినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొండ భూముల్లోనూ అక్రమ మైనింగ్‌ చేయడం కోసం రెవెన్యూ అఽధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారని తెలుస్తోంది. ఏదో ఒక పేరు చెప్పి పోలీసు శాఖకు ఆ స్థలం బదిలీ కాకుండా రెవెన్యూ అధికారులే అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. త్వరితగతిన ఈ భూముల అప్పగించాలని పోలీసు శాఖ నుంచి గన్నవరం రెవెన్యూ అధికారులను తాజాగా విజ్ఞప్తి వచ్చింది. తాజా విజ్ఞప్తిపైనా రెవెన్యూ అధికారులు మెలిక పెట్టారు. ఈ భూములను కేటాయించటానికి స్థానిక పంచాయతీ నుంచి అనుమతి పత్రం కావా లని ెప్పారు. వాస్తవానికి వెదురుపావులూరులోని సర్వే నెంబర్‌ 717(పీ) లోని ఐదెకరాల భూమి పంచాయతీకి సంబంధించినది కాదు.

Updated Date - Jan 28 , 2024 | 01:19 AM