Share News

11 నుంచి తిరుపతి, విశాఖపట్నం రైళ్ల పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:00 AM

మచిలీపట్నం నుంచి తిరుపతి, విశాఖపట్నానికి ఆగస్టు 11వతేదీ నుంచి రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ హామీ ఇచ్చారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

11 నుంచి తిరుపతి, విశాఖపట్నం రైళ్ల పునరుద్ధరణ

రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్‌ హామీ ఇచ్చారన్న ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, జూలై 27( ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం నుంచి తిరుపతి, విశాఖపట్నానికి ఆగస్టు 11వతేదీ నుంచి రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ హామీ ఇచ్చారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రైళ్లను పునరుద్ధరించాలని అశ్వినివైష్ణవ్‌ను శనివారం ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం- విజయవాడ మధ్య నడిచే పలు రైళ్లను వడ్లమన్నాడు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం నిలపాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదనలో ఉన్న వంతెనలు, గేట్లతోపాటు, పది ప్రాంతాల్లో రైల్వేఓవర్‌, అండర్‌బ్రిడ్జిల పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తిచేయాలని మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కనీస మౌలికవసతులు, సుందరీ కరణ పనులు చేయాలని రైల్వేమంత్రిని కోరినట్లు తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 01:01 AM