Share News

వైఎస్‌ఆర్‌ పేరు తొలగింపు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:40 AM

నందిగామలోని రైతుబజార్‌కు ఉన్న వైఎస్‌ఆర్‌ పేరును కొందరు టీడీపీ సానుభూతిపరులు తొలగించారు.

 వైఎస్‌ఆర్‌ పేరు తొలగింపు
వైఎస్‌ఆర్‌ పేరును తొలగిస్తున్న టీడీపీ సానుభూతిపరులు

నందిగామ, జూన్‌ 5: నందిగామలోని రైతుబజార్‌కు ఉన్న వైఎస్‌ఆర్‌ పేరును కొందరు టీడీపీ సానుభూతిపరులు తొలగించారు. రైతుబజార్‌ ఏర్పాటు సమయంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ పేరు పెట్టారు. ఇటీవల ఈ రైతుబజార్‌కు అనుసందానంగా పండ్ల మార్కెట్‌ ఏర్పాటు చేసిన ప్రభుతం ఆ పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కసారిగా బోర్డును ధ్వంసం చేశారు. వైఎస్‌ఆర్‌ అన్న అక్షరాలను పీకి వేశారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై పలువురు టీడీపీ నాయకులు స్పందిస్తూ రైతుబజార్‌ను ఏర్పాటు చేసిన దేవినేని రమణ పేరును అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు తొలగించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమకు అధికారం ఉన్నందున తామ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ పేరు తొలగించారని సమర్థించుకుంటున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:40 AM