Share News

కాల్వగట్టుపై ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:41 AM

29వ డివిజన్‌ మధురానగర్‌ వీవీ నరసరాజు రోడ్డు కాల్వ గట్టు మీద ప్రార్థన మందిరిరాల పేరిట జరుగుతున్న స్థలాల ఆకమ్రణ దందాపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

కాల్వగట్టుపై ఆక్రమణల తొలగింపు
పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు

మధురానగర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : 29వ డివిజన్‌ మధురానగర్‌ వీవీ నరసరాజు రోడ్డు కాల్వ గట్టు మీద ప్రార్థన మందిరిరాల పేరిట జరుగుతున్న స్థలాల ఆకమ్రణ దందాపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బుధవారం ఆక్రమణల తొలగింపు సమయంలో కొందరు ఇరిగేషన్‌, వీఎంసీ సిబ్బందిపై దాడులకు తెగబడటానికి ప్రయత్నిం చడంతో పోలీసుల రక్షణ కోరినా రాకపోవడంతో తొలగింపు మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. పోలీసుల తీరును అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం రాత్రి వీఎంసీ అధికారులను పోలీసులకు ఫిర్యాదు చేయా లని ఆదేశాలు వచ్చాయి. టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీ డి.శ్రీకాంత్‌ (27)తో వీఎంసీ ఏసీపీ గుణదల పోలీసులకు, ఏసీపీ, డీసీపీలకు ఫిర్యాదు చేయించారు. దీంతో కదలిన పోలీసులు గురువారం తెల్లవారు జామున నాలుగు గంటకు యంత్రాలు, ట్రాక్టర్‌లతో ఆక్రమ ణలు తొలగించారు. ప్రారథన మందిరాల పేరిట వేసిన నిర్మాణాలను, వాటి చుట్టు ఉన్న స్ర్కాప్‌ను, తుక్కు కింద వచ్చిన వాహ నాలను మొత్తాన్ని ఎక్స్‌కవేటర్లతో ఎత్తి ట్రాక్టర్‌లలో తరలించారు. ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమించినా, అక్కడ ఎదన్నా స్ర్కాప్‌ పెట్టినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని బోర్డులు పెట్టి అధికారులు హెచ్చరించారు.

ఇంకా గార్డెన్‌ల మాటున..

స్ర్కాప్‌ వ్యాపారులు ఆక్రమించిన స్థలాల జోలికి ఎవరు రాకుండా ప్రార్ధన మందిరాల పేరిట నడి చిన డ్రామాకు వారం రోజులుగా అధికారులు ప్ర యత్నాలు చేసి తొలగించారు. కొన్ని చోట్ల తమ ఇంటి ముందు ఉన్న కట్ట ప్రాంతాన్ని ఆక్రమించి పూల చెట్ట పేరుతో గార్డెన్‌లు పెంచుతున్నారు. వాటిని కూడా తొలగించాలని, 31వ డివిజన్‌ వైపు ఫ్లైవోవర్‌ నుంచి ప్రభుత్వ ముద్రణాలయం వైపు ఉన్న కట్టమీద ప్రార్థన మందిరాల పేరిట కట్టిన నిర్మాణాలు, నర్సరీలను కూడా తొలగించాలని మధురానగర్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:41 AM