Share News

రాష్ట్రంలో గాడితప్పిన పాలన

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:57 AM

రాష్ట్రంలో అన్ని రంగాల్లో పాలన గాడి తప్పిందని పాలనను గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారీటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. పెనమలూరు మండలంలోని తాడిగడప మునిసిపాలిటి పరిధిలోని పోరంకి 4వ వార్డులో మంగళవారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు.

 రాష్ట్రంలో గాడితప్పిన పాలన
పోరంకిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

తాడిగడప (పెనమలూరు), జనవరి 2 : రాష్ట్రంలో అన్ని రంగాల్లో పాలన గాడి తప్పిందని పాలనను గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడుకే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారీటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. పెనమలూరు మండలంలోని తాడిగడప మునిసిపాలిటి పరిధిలోని పోరంకి 4వ వార్డులో మంగళవారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌, మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. దాచుకోవడం.. దోచుకో వడం మినహా రాష్ట్రానికి జగన్‌ మోహన్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమం లో అనుమోలు ప్రభాకర్‌, బొప్పన లావణ్య, చక్రవర్తి, సెంగెపు రంగా రావు, అబ్రహం, షేక్‌ సలీం పాల్గొన్నారు.

తాడిగడపలో..

మండలంలోని తాడిగడప కట్టపై మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేడసాని రత్నకుమారి, రేఖ, నాగమణి, కనకదుర్గ, ప్రమీళ, తుమ్మల రామ్‌కుమార్‌, గోపీ చంద్‌, మన్నే రాజాబాబు, నాగుల్‌మీరా, మేడసాని వెంకటేశ్వరరావు, పామర్తి సిద్ధయ్య, కిలారు రవివర్మ, దామోదర్‌, కందుల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వేల్పూరులో..

వేల్పూరు (కంకిపాడు) : బాబూ ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీపై మండలంలో విస్తృత ప్రచారం చేపట్టామని టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర అన్నారు. మండలంలోని వేల్పూరులో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అన్నే ధనయ్య, కొణతం సుబ్రహ్మణ్యం, చలసాని బుజ్జి, పామర్తి ప్రసాద్‌, రామారావు, అజయ్‌, రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:57 AM