Share News

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నేత చంద్రబాబు

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:44 AM

సైకో జగన్‌రెడ్డి పాలనలో ఎన్నో ఆటుపోట్లకు గురైన ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడగలిగే ఒక్కగానొక్క వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ సతీమణి హేమ పేర్కొన్నారు. ఆదివారం యనమలకుదురు వినాయకనగర్‌ కట్టపై జరిగిన శంఖారావం పాదయాత్ర సందర్భంగా ఆమె స్థానిక నాయకులతో పాల్గొని మాట్లాడారు.

 రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నేత చంద్రబాబు
యనమలకుదురులో బోడె హేమ ప్రచారం

పెనమలూరు, ఏప్రిల్‌ 21 : సైకో జగన్‌రెడ్డి పాలనలో ఎన్నో ఆటుపోట్లకు గురైన ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడగలిగే ఒక్కగానొక్క వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ సతీమణి హేమ పేర్కొన్నారు. ఆదివారం యనమలకుదురు వినాయకనగర్‌ కట్టపై జరిగిన శంఖారావం పాదయాత్ర సందర్భంగా ఆమె స్థానిక నాయకులతో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతనేని ఆజా ద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, బలగం నాగరాజు, పాదాల ప్రభాకర్‌, వీరంకి కుటుంబరావు, తమ్ము అశోక్‌, వీరంకి నంది, మల్లంపాటి విజయలక్ష్మి, పండుల రజిని, షాహీనా, షకీలా, మేక స్వాతితేజ, సుబ్బారావు, సింగం సుబ్రహ్మణ్యం, సయ్యద్‌ ఇబ్రహీం, వెంకటేష్‌, రామారావు పాల్గొన్నారు.

జగన్‌ను గద్దె దింపడం మహిళలకే సాధ్యం

గుణదల : బ్రిటీష్‌ పాలనను తలపిస్తున్న జగన్మోహన రెడ్డిని గద్దె దింపడం మహిళలకే సాధ్యమని యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి తన సొంత మద్యం విక్రయాలు యథేచ్ఛగా చేసుకుని కోట్లు గడించా రన్నారు. ఎంతో మంది నాశిరకం మందు తాగేలా చేసి కోట్లు గడించిన జగన్‌ను గద్దె దింపడానికి మహిళలంతా ఒకటయ్యారని, పథకాలకు బటన్‌ నొక్కిన జగన్‌ అభివృద్ధిని పూర్తిగా మరిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి గాడిలో పడాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిందేనని, మరోమారు జగన్‌ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మహిళలు ఆర్థికంగా బలప డాలన్నా, బీసీ కార్పొరేషన్‌ తిరిగి పునరుద్ధరించబడాలన్నా సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి యార్లగడ్డ వెంకట్రావును గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, సర్నాల బాలాజి, కొల్లా ఆనంద్‌, ఉల్లాస శివ, మహేష్‌, ఇజ్జి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:44 AM