ప్రజల గుండెల్లో రంగాకు సుస్థిర స్థానం
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:15 AM
ప్రజల గుండెల్లో వంగవీటి మోహన రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, 1988లో రంగా మరణించినా నేటికీ ప్రజలు ఆయనను స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

కంకిపాడు: ప్రజల గుండెల్లో వంగవీటి మోహన రంగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, 1988లో రంగా మరణించినా నేటికీ ప్రజలు ఆయనను స్మరించుకోవడమే అందుకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీఎం రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన ఆవిష్కరించారు. కంకిపాడు బైపాస్‌పై రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా గ్రామస్థులు కొరుతున్నా రని, వారి కోరిక నేటికి నెరవేరిందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.
యనమలకుదురు, పోరంకి, కానూరులో..
పెనమలూరు: వీఎం రంగా జయంతి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. యనమలకుదురు, పోరంకి, కానూరు గ్రామాల్లోని రంగా విగ్రహాలకు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోరంకి ప్రధాన కూడలి వద్ద రంగా విగ్రహానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చెన్నుపాటి శ్రీనివాస్, తాతపూడి గణేష్, వంగూరు మురళి, వంగూరు లీల, వంగూరు మురళి, వీర్ల సాయి, యేనుగ శ్రీనివాస్, మల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.