Share News

రామోజీ జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:15 AM

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయ న వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం పోరంకి టీడీపీ కార్యాలయంలో దివంగత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.

 రామోజీ జీవితం స్ఫూర్తిదాయకం
రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బోడె ప్రసాద్‌

పెనమలూరు, జూన్‌ 8 : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్‌ రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయ న వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం పోరంకి టీడీపీ కార్యాలయంలో దివంగత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనుమోలు ప్రభాకరరావు, కోయ ఆనంద్‌ప్రసాద్‌, మారుపూడి ధనకోటేశ్వరరావు, శొంఠి శివరాంప్రసాద్‌, పీతా గోపీచంద్‌, తుమ్మల రాంకుమార్‌, సుంకర రమేష్‌, మండవ జయదేవ్‌, దండమూడి చౌదరి, కిలారు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. యనమలకుదురులో జరిగిన కార్యక్రమంలో దివంగత రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. పత్రికా రంగం, వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మొక్కపాటి శ్రీనివాస్‌, గంధం సురేష్‌, వీరాస్వామి, శొంఠి శివరాంప్రసాద్‌, ప్రసాద్‌, శేషు, కావటి బుజ్జి, భద్రి తదితరులు పాల్గొన్నారు. దివంగత రామోజీరావు చిత్రపటానికి పెనమలూరు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

రామోజీరావు యువతకు ఆదర్శమని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు పేర్కొన్నారు. శనివారం కానూరు టీడీపీ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. పెదపులిపాకలో జరిగిన రామోజీరావు నివాళి సభలో ముసునూరి శ్రీనివాసరావు, ముసునూరి శ్రీధర్‌, గుంటూరు విశ్వేశ్వరరావు, అట్లూరి శివనాగేశ్వరరావు, పోలవరపు రామారావు, పోలవరపు నరేంద్రకుమార్‌, ఆలపాటి మోహన్‌రావు, గుండిమెడ నాగమధు, గుంటూరు రామకోటేశ్వరరావు, మల్లిఖార్జునరావు, రాముడు, శ్రీనివాసరావు, బుజ్జి, పొట్లూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రామోజీకి యార్లగడ్డ ఘన నివాళి

గన్నవరం : పత్రిక రంగానికి ఎనలేని సేవలందించిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రా వు పేర్కొన్నారు. రామోజీరావు పార్ధీవదేహాన్ని హైదరాబాద్‌ వెళ్లి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో రామో జీరావు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు సేవలను కొనియాడారు. నాయకులు సాయిరాం, తాతారావు, రవికుమార్‌, అరుణ, శ్రీనివాసరావు, మురళీ తదితరులు పాల్గొన్నారు.

రామోజీరావుకు వైవీబీ నివాళి

ఉయ్యూరు : ఈనాడు సంస్థల అఽధినేత పద్మవిభూషణ్‌ రామోజీరావు మృతి అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఉయ్యూరులో తన కార్యాల యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామోజీ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామో జీ జీవితం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. మైనారి టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి అజ్మతుల్లా, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఫణి, 10వ వార్డు కౌన్సిలర్‌ పల్యాల శ్రీనివాసరావు, బూరెల నరేశ్‌ తదితరులు పాల్గొని రామోజీకి నివాళులర్పించారు.

రైతాంగానికి తీరనిలోటు : చలసాని

హనుమాన్‌జంక్షన్‌ : గ్రామీణ ప్రాంత రైతాంగానికి అవస రమైన పాడి పరిశ్రమ, వ్యవసాయ విజ్ఞానాన్ని ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా ద్వారా అందించిన అక్షరయోధుడు రామో జీరావు అని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రామోజీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి చిం తిస్తూ స్థానిక పాలశీతల కేంద్రంలో రామోజీ చిత్రపటం వద్ద చలసాని నివాళులర్పించారు. అనంతరం హైదారాబాద్‌ వెళ్లి రామోజీ పార్ధీవదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

పత్రిక ద్వారా రాజకీయంగా ప్రజల్ని చైతన్యం చేసిన రామోజీరావు మరణం ఇటు పత్రిక రంగానికి, అటు సినీ రంగానికి తీరనిలోటని టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు అన్నారు. రామోజీ మరణానికి చిం తిస్తూ శనివారం స్థానిక టీడీపీ మండల కార్యాలయంలో శ్రద్ధాం జలి ఘటించారు. రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయ కులు గుండపనేని ఉమావర ప్రసాద్‌, వేములపల్లి శ్రీని వాసరావు, మూల్పూరి సాయికల్యాణి, అట్లూరి శ్రీనివాసరావు, కలపాల సూర్యనారాయణ, మొవ్వా వేణుగోపాల్‌, మండాది రవీంద్ర, చలసాని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక శ్రవంతి చారిటబుల్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో శనివారం రామోజీ మృతికి సంతాపం తెలియజేశారు. ట్రస్ట్‌ చైర్మన్‌ వీర మాచినేని సత్యప్రసాద్‌ రామోజీ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమదల సుధాకర్‌, యార్లగడ్డ సత్యనారాయణ, వడ్లమూడి ఆంజనే యులు, కర్ర ప్రసాద్‌, ఆళ్ల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:15 AM