Share News

దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం

ABN , Publish Date - May 17 , 2024 | 12:52 AM

దేవదాయ శాఖ ఆధీనంలోని వీరవల్లి, చిరివాడ గ్రామాల్లోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, మే 16: దేవదాయ శాఖ ఆధీనంలోని వీరవల్లి, చిరివాడ గ్రామాల్లోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరవల్లిలోని కొండేశ్వరస్వామి దేవస్థానం భూములకు శుక్రవారం ఉదయం 10 గంటలకు, వేణుగోపాలస్వామి దేవ స్థానం భూములకు ఉదయం 11గంటలకు, చిరివాడలోని చంద్రశేఖరస్వామి దేవస్థాన భూములకు మధ్యాహ్నం 3గం టలకు ఆలయ ప్రాంగణాల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేవస్థానాలకు గతంలో బకా యిలున్న వారు వేలంలో పాల్గొనేందుకు అనర్హులని తెలిపారు. నిర్ణయించిన ధరావత్తు సొమ్ముతో పాటు ఆర్థిక స్థితి గతులు తెలిపే ఒరిజినల్‌ పత్రంతో వేలంలో పాల్గొనాలని సూచించారు. హెచ్చుపాటదారుడు పాడుకున్న మొత్తంలో సగం సొమ్ము పాటముగిసిన వెంటనే చెల్లించాలని ఈవో పేర్కొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:52 AM