Share News

బాలికపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:47 AM

పాపవినాశనం గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించా వంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాస్‌పై బుధవారం బాలిక తల్లి దండ్రులు, గ్రామస్థులు దాడికి యత్నించారు.

బాలికపై ప్రధానోపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఉత్తర్వులు..విచారణకు ఆదేశం

ఘంటసాల, ఫిబ్రవరి 28: పాపవినాశనం గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించా వంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాస్‌పై బుధవారం బాలిక తల్లి దండ్రులు, గ్రామస్థులు దాడికి యత్నించారు. మంగళవారం తన పట్ల ప్రధానో పాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఇంటి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడిని తల్లిదండ్రులు, గ్రామస్థులు నిలదీశారు. ఆయన బుకాయించటంతో దాడికి యత్నించారు. గ్రామ పెద్దలు సముదాయించి ఎంఈవో దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్‌

మచిలీపట్నం టౌన్‌: పాపవినాశనం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బి.శ్రీనివాస్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో డీఈవో తాహెరా సుల్తానా సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ చేయాలని ఎంఈవో శివశంకర్‌ను డీఈవో ఆదేశించారు.

నేడు పాఠశాలలో విచారణ జరుపుతాం

బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. గురువారం ఉదయం పాఠశాల వెళ్లి విచా రణ జరుపుతాం. డీఈవోకు నివేదిక అందజేస్తాం.

-ఎన్‌.శివశంకర్‌రావు, ఎంఈవో-1, ఘంటసాల

Updated Date - Feb 29 , 2024 | 12:47 AM