డోకిపర్రు వేంకటేశ్వరస్వామికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:40 AM
డోకిపర్రు భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
గుడ్లవల్లేరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): డోకిపర్రు భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. బేడీ ఆంజనేయస్వామి ఆల యం నుంచి స్వామికి చంద్రబాబు పట్టువస్త్రాలను తీసు కురాగా వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులను సీఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ వేద పండితులతో వేద ఆశీర్వచనాలు పలికారు. కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు ఆయనకు వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, స్వామి లడ్డూ ప్రసాదాన్ని బహుకరించారు. తర్వాత ఆలయం నుంచి బయటికి వచ్చిన సీఎం..నిర్వాహకుల గెస్ట్‌హౌ్‌సను సందర్శించేందుకు వెళ్లారు. గెస్ట్‌హౌ్‌సలోని సమావేశ మందిరం, మినీ థియే టర్, భోజన శాల, ముఖ్యమైన గదులను కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు ముఖ్యమంత్రికి చూపించారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గెస్ట్ హౌస్ నుంచి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారు.
సీఎంకు ఘన స్వాగతం
డోకిపర్రులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో చాపర్ నుంచి దిగిన ముఖ్యమంత్రికి ఆలయ ధర్మకర్తలు పీవీ కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్యచౌదరి స్థానిక టీడపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.