Share News

ప్రేమానురాగాలు పెంచే రక్షాబంధన్‌

ABN , Publish Date - Aug 20 , 2024 | 12:20 AM

సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండుగే రక్షాబంధన్‌ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండలంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రేమానురాగాలు పెంచే రక్షాబంధన్‌
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రాఖీ కడుతున్న సాయి కల్యాణి,

గన్నవరం, ఆగస్టు 19 : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండుగే రక్షాబంధన్‌ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండలంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా, తమ్ముళ్లకు తమ సోదరి రాఖీలు కట్టి సందడి చేశారు. గన్న వరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి, మండల అధ్యక్షురాలు చిక్కవరపు నాగమణి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలసిమెలసి ఉండాలని తెలిపారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : మహిళలకు అండగా నిలుస్తూ ఆర్థికాభివృద్ధికి, స్వావలంబనకు చేయూతనిచ్చేది ఎన్డీయే కూటమి ప్రభుత్వం మాత్రమేనని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికళ్యాణి తెలిపారు. రక్షాబంధన్‌ సందర్భంగా సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంక ట్రా వుకు రాఖీ కట్టి శుభాకాం క్షలు తెలియజేశారు. ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్న నారా లోకేశ్‌ను మార్యద పూర్వకంగా కలిసి రాఖీ కట్టి ఆశీస్సులందుకున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వగృహంలో ఆయన చేతికి రాఖీ కట్టి ఆశీస్సులందుకున్నారు. మహిళా సంక్షేమమే లక్ష్యంగా గౌరవం, భద్రత కల్పించేలా టీడీపీ, జనసే న, బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారన్నారు.

విద్యార్థుల్లో సోదరభావం

విద్యార్థుల్లో సోదరభావం పెంపొందించే విధ గా సమాజంలో మహిళపట్ల గౌరవభావంతో మెలిగేలా పాఠశాల స్థాయిలోనే అలవాటు చేసేందుకు సామూహిక రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహిం చడం అభినందనీయమని హెచ్‌ఎం కృష్ణమోహన్‌ అన్నారు. మల్లవల్లి ఎంపీపీ స్కూల్‌ హెచ్‌ఎం సక్కుబాయమ్మ అధ్యక్షతన సోమవారం నిర్వహిం చిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే నైతిక విలువలు పెంపొందించే విధంగా వినూత్న కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నా రు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సామూహిక రక్షాబంధన్‌ కార్యక్రమ రూపకర్త శివనాగకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

కంకిపాడు : అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా జరుపుకునే రక్షా బంధన్‌ వేడుకలను మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అక్కా తమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్న మహోన్నత శిఖరా లను అధిరోహించాలని ఆకాంక్షింస్తూ ఈ రాఖీని కడుతుంది. మాజీ ఎంపీపీ దేవినేని రాజాకు వార్డు సభ్యురాలు మైనేని దుర్గాభవాని రాఖీ కట్టారు. అదే విధంగా జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయ కర్త ముప్పా రాజాకు ఆయన చెల్లెళ్లు మేదండ్రావు తేజస్వీ, ఎండువ అమ్ము, యలిశెట్టి జ్యోష్ణ తదితరులు రాఖీ కట్టి అనుబంధాన్ని చాటుకున్నారు.

ఉయ్యూరు : సృష్టిలో ఎన్ని బంధాలున్నా రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల బంధం అమూల్యమైన బంధమని భావించి సోమ వారం రాఖీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అన్నదమ్ములకు అక్కచెళ్లెల్లు రాఖీలు క ట్టి ఆశీర్వదించారు. ఈసందర్భంగా రాఖీ బంధన్‌ విశిష్టతను వివరించి అన్నదమ్ములు అక్కచెళ్లెల్ల ప్రేమానురాగాలు చాటారు.

Updated Date - Aug 20 , 2024 | 12:20 AM