ప్రయాణం.. నరకం!
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:01 AM
విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే కృష్ణానది కరకట్ట కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో కరకట్ట రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. కనీస మరమ్మతులు చేయాల్సిన అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కరకట్ట రోడ్డు నెర్రెలు బారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.

ఫ తరచూ ప్రమాదాలతో నెత్తురోడుతున్న కరకట్ట
ఫ మరమ్మతులు చేపట్టటంలో ప్రభుత్వం విఫలం
ఫ బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
(పెనమలూరు - ఆంధ్రజ్యోతి)
విజయవాడ నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే కృష్ణానది కరకట్ట కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో కరకట్ట రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. కనీస మరమ్మతులు చేయాల్సిన అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కరకట్ట రోడ్డు నెర్రెలు బారి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. కరకట్ట రోడ్డుపై వాహనదారులు ప్రమాదాలకు లోనై గాయాలపాలవడం పరిపాటిగా మారింది. యనమలకుదురు నుంచి అవనిగడ్డ వరకు ఉన్న కరకట్టపై ప్రతిరోజూ సరాసరి రెండు నుంచి మూడుకు తక్కువ కాకుండా ప్రమాదాలు చోటు చేసుకొని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవుతున్నారంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కరకట్టకు కనీస మరమ్మతులు చేసి కరకట్టపై ప్రయాణం సజావుగా సాగేట్లు చేస్తారని ప్రయాణికులు కోరుతున్నారు.