Share News

ప్రశాంతంగా టెట్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:52 AM

ఏపీ టెట్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 3615 మంది అభ్యర్థులకు 3299 మంది హాజరయ్యారు. 91.25 శాతం హాజరు నమోదైంది.

ప్రశాంతంగా టెట్‌
మచిలీపట్నంలో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 27 : ఏపీ టెట్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 3615 మంది అభ్యర్థులకు 3299 మంది హాజరయ్యారు. 91.25 శాతం హాజరు నమోదైంది. ఉదయం 1637 మంది, మధ్యాహ్నం 1662 మంది హాజరయ్యారు. విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, డైట్‌ ప్రిన్సిపాల్‌ కె.లక్ష్మీనారాయణలు కానూరు అయాన్‌ డిజిటల్‌ జోన్‌, కానూరు శైలేష్‌ ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ కేంద్రాలను సందర్శించారు. మచిలీపట్నం ఎస్వీహెచ్‌ డీఎంఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏడీ మనోహర్‌ నాయక్‌, ఎంఈవో దుర్గా ప్రసాద్‌లు సందర్శించారు.

ప్రశ్నాపత్రంలో అమ్మఒడి!

టెట్‌ 150 మార్కుల ప్రశ్నాపత్రం అబ్జెక్టివ్‌ విధానంలో ఇవ్వగా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రంలో అమ్మఒడికి సంబంధించి విద్యార్ధులకు పథకం వర్తించేందుకు హాజరుశాతం ఎంత ఉండాలనే ప్రశ్న ఇచ్చారు.

Updated Date - Feb 28 , 2024 | 12:52 AM