ఆదరించిన ప్రజలకు అండగా ఉంటా
ABN , Publish Date - Jul 01 , 2024 | 01:23 AM
ఆదరించిన ప్రజలకు అండగా ఉంటా నని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గోసాలలో ఆదివారం నిర్వహిం చిన విజ యోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెనమ లూరు నియోజక వర్గంలో 2009 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 60 వేల మెజారిటీ ఇవ్వడం జరిగిం దన్నారు ప్రజలను తనను ఏ విధంగా ఆదరించారో అర్థం అవుతుం దని, ఆదరించిన నియోజక వర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
గోసాల (కంకిపాడు), జూన్ 30 : ఆదరించిన ప్రజలకు అండగా ఉంటా నని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గోసాలలో ఆదివారం నిర్వహిం చిన విజ యోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెనమ లూరు నియోజక వర్గంలో 2009 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 60 వేల మెజారిటీ ఇవ్వడం జరిగిం దన్నారు ప్రజలను తనను ఏ విధంగా ఆదరించారో అర్థం అవుతుం దని, ఆదరించిన నియోజక వర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదు ర్కొంటున్న రోడ్లు, డ్రెయినేజీ వంటి ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతానన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా పోరంకిలోని తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్, కోయా ఆనంద్, సెంగెపు రంగారావు, కోనేరు సాంబ శివరావు, మాబు సుబాని, ఆంజనేయులు, కోటేశ్వరరావు, కాసరనేని మురళి, ఎండవ రాంబాబు, బిల్లా సత్యనారాయణ, షేక్ లాలీ పాల్గొన్నారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి
పెనమలూరు : 2019లో గత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తెచ్చిన సీపీఆర్‌సీ చట్టాన్ని సవరించి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు పంచకర్ల రంగారావు మాట్లాడుతూ, రైతాంగం సాధించుకొన్న 2011 కౌలు రైతుల చట్టాన్ని గత ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా రద్దు చేసిందని, భూయజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామని ప్రకటించిందని వాపోయారు. దీనివల్ల వాస్తవ సాగుదారులయిన కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా, ఈ క్రాప్ బుకింగ్, పంటబీమా, పంట నష్టపరిహారాలు, బ్యాంకు రుణాలు తదితరాలు ఏవీ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోడె మా ట్లాడుతూ, కౌలు రైతుల ఇబ్బందులను అసెంబ్లీలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాదు నాగేశ్వరరావు, పెదపూడి శ్రీనివాస్, మరియదాసు, త్రిమూర్తులు, రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.