Share News

యువకుడిపై పోక్సో కేసు

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:39 AM

బాలికను మోసగించిన ఓ యువకుడిపై నున్న రూరల్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

యువకుడిపై పోక్సో కేసు

పాయకాపురం, జూన్‌ 23: బాలికను మోసగించిన ఓ యువకుడిపై నున్న రూరల్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కండ్రిక కాలనీకి చెందిన బాలిక(17) ఇంటర్‌ రెండో ఏడాది చదువు తోంది. రాజీవ్‌నగర్‌కు చెందిన పైడి శ్యామ్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 01:39 AM