Share News

మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:14 AM

పోస్టల్‌ బ్యాలెట్‌కు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే 23 వేలమంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది.

మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పోస్టల్‌ బ్యాలెట్‌కు ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మే 4, 5, 6, 7 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించాలని ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించే 23 వేలమంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలు ప్రణాళికా లోపం కారణంగా గందరగోళంగా మారాయి. కేంద్రంలో తోపులాటలు, గొడవలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్‌ జిల్లాలో ఈసారి ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలకు కామన్‌గా ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐజీఎంసీ) స్టేడియంలో ప్రధాన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానికంగా ఎక్కడి వారు అక్కడే పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునే విధంగా చూడాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలో ఏడు వేలమందిని పంపి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయించగలిగితే.. మిగిలిన ఏడు వేలమందిని ఐజీఎంసీలో ఓటు వేయించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఐజీఎంసీ స్టేడియంలో నిర్వహించే పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎక్కువ కౌంటర్లు, రద్దీ లేకుండా ఉండటానికి పటిష్ట బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు బ్యాలెట్‌ బాక్సులను ఉపయోగిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో ఏ జిల్లాకు చెందిన ఉద్యోగులైనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా జిల్లాల బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు చేస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ పరిధిలోకి వచ్చేవారు..

ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి, అధికారి పోస్టల్‌ బ్యాలెట్‌ పరిధిలోకి వస్తారు. వీరంతా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 23 వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ సమయంలో విధులు నిర్వహించే వారు 13వేల పైచిలుకు ఉంటారు. వీరిలో ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్యం, మునిసిపల్‌, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటారు. ఈసారి ఆర్టీసీ ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల విధి నిర ్వహణలో ఉండే ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిథులకూ పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.

ఎన్నికల సంఘం ఇచ్చే ధ్రువీకరణ పత్రం చూపాలి

ఎనికల విఽధుల్లో ఉండే ఉద్యోగులు ఫామ్‌-12 డీ సమర్పిచేందుకు ఈ నెల 26 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. ఫామ్‌-12 డీ సమర్పించిన వారికి ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక గుర్తింపు పత్రాన్ని ఇస్తుంది. దీనితో పాటు ఓటరు ఐడీ, ఆధార్‌ కార్డు తమ వెంట తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రానికి వెళితే.. అక్కడ వివరాలు నమోదు చేసుకుని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సీల్డ్‌ కవర్‌తో కూడిన పోస్టల్‌ బ్యాలెట్‌లను ఇస్తారు. వాటిని తీసుకుని రహస్య ప్రదేశంలో ఓటు వేసిన తర్వాత తిరిగి వాటినికవరులో పెట్టి సీల్‌ వేసి పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అది ముగిసిన తర్వాత పోలీసు బందోబస్తు మధ్య సంబంధింత అసెంబ్లీ నియోజకవర్గాల రిసెప్షన్‌ సెంటర్లలో స్ర్టాంగ్‌ రూమ్‌ల్లో వాటిని భద్రపరుస్తారు.

Updated Date - Apr 25 , 2024 | 01:14 AM