Share News

తిరువూరులో పడకేసిన పారిశుధ్యం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:46 AM

పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ప్రజలు ఆనారోగ్యాల బారిన పడుతున్నా మునిసిపల్‌ పాలకులు, అధికారుల్లో స్పందన లేదని టీడీపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌ విమర్శించారు.

తిరువూరులో పడకేసిన పారిశుధ్యం
కౌన్సిల్‌లో ప్రశ్నిస్తున్న టీడీపీ కౌన్సిలర్‌ అబ్దుల్‌ హుస్సేన్‌

తిరువూరు, ఫిబ్రవరి 29: పట్టణంలో పారిశుధ్యం పడకేసిందని, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి ప్రజలు ఆనారోగ్యాల బారిన పడుతున్నా మునిసిపల్‌ పాలకులు, అధికారుల్లో స్పందన లేదని టీడీపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌హుస్సేన్‌ విమర్శించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. పట్టణంలో కనీస కచ్చాడ్రెయిన్లు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపై, నివాసాల మధ్య నిలిచి ఉండటంతో పరిపర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలో వేసిన వెంచర్లకు సంబంధించిన మునిసిపాలిటీకి స్ధలం కేటాయిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా వాస్తవంలో స్థలం ఉండటం లేదన్నారు. కేటాయించిన స్థలాలు కౌన్సిలర్లకు చూపించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అజెండాలోని పలు అంశాలను అధికార పార్టీ కౌన్సిలర్లు అమోదించారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ లోవరాజు, వైస్‌చైర్‌పర్సన్లు వెలుగోటి విజయలక్ష్మి, గుమ్మ వెంకటేశ్వరి, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:46 AM