Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పోలింగ్‌ కేంద్రాలు ఫిక్స్‌

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:30 AM

ఎన్నికల నోటిఫికేషన్‌కు సన్నద ్ధమౌతున్న దశలో ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాలను ఫిక్స్‌ చేసింది. ఈ మేరకు ఫిక్స్‌ చేసిన పోలింగ్‌ కేంద్రాల వివరాలను జిల్లా ఎన్నికల యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. పోలింగ్‌ కేంద్రాలను ఫిక్స్‌ చేయటం వల్ల వీటిని మార్చే అవకాశం అయితే లేదు. తుది ఓటర్ల జాబితా అనంతరం ఓటర్ల దామాషాకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను పెంపుదల చేయాల్సి వచ్చింది. కొద్దిరోజుల కిందటే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పది పోలింగ్‌ కేంద్రాలను పెంచారు.

పోలింగ్‌ కేంద్రాలు ఫిక్స్‌

ఎన్నికల సంఘానికి చేరిన జాబితా

ఎన్టీఆర్‌ జిల్లాలో 1781 కేంద్రాలు

వీటికి అదనంగా విజయవాడ రూరల్‌లోని 82 పోలింగ్‌ కేంద్రాలు జిల్లా పరిధిలోకి..

అత్యధికంగా విజయవాడ వెస్ట్‌లో 298 కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్నికల నోటిఫికేషన్‌కు సన్నద ్ధమౌతున్న దశలో ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్‌ కేంద్రాలను ఫిక్స్‌ చేసింది. ఈ మేరకు ఫిక్స్‌ చేసిన పోలింగ్‌ కేంద్రాల వివరాలను జిల్లా ఎన్నికల యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. పోలింగ్‌ కేంద్రాలను ఫిక్స్‌ చేయటం వల్ల వీటిని మార్చే అవకాశం అయితే లేదు. తుది ఓటర్ల జాబితా అనంతరం ఓటర్ల దామాషాకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను పెంపుదల చేయాల్సి వచ్చింది. కొద్దిరోజుల కిందటే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పది పోలింగ్‌ కేంద్రాలను పెంచారు. ఇలా ప్రతి నియోజకవర్గం పరిధిలో స్వల్పంగా పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. కలెక్టర్‌ దిల్లీరావు ఇటీవల తరచూ రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతూ పోలింగ్‌ కేంద్రాల పెంపుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1781 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో తిరువూరు నియోజకవర్గంలో 234 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గంలో 253 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు, విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలు, మైలవరం నియోజకవర్గంలో 295 పోలింగ్‌ కేంద్రాలు, నందిగామ నియోజకవర్గంలో 222 పోలింగ్‌ కేంద్రాలు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 222 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గన్నవరం నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాలు ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోనే..

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో 1781 పోలింగ్‌ కేంద్రాలు కాకుండా కృష్ణాజిల్లా పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ రూర ల్‌ మండలం పరిధిలోని పలు గ్రామాలు ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇవి 82 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. గన్నవరంతో కూడా కలిపితే మొత్తం 1863 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

Updated Date - Mar 04 , 2024 | 01:30 AM