పోలీసుల స్ట్రీట్‌వాక్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:27 AM
ప్రజలు ఽధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు అన్నారు.

పోలీసుల స్ట్రీట్‌వాక్
పాయకాపురం, మార్చి 5 : ప్రజలు ఽధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్ వాంబేకాలనీలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ఏడీసీపీ శ్రీహరిబాబు, నార్త్‌జోన్ ఏసీపీ డిఎన్‌వి. ప్రసాద్ కాలనీలోని వివిధ బ్లాక్‌ల్లో 200 మంది సిబ్బందితో స్ట్రీట్ వాక్ చేశారు. వివిధ బ్లాక్‌లలోకి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఐలు దుర్గాప్రసాద్, గురుప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.