ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలనే ఫుట్ పెట్రోలింగ్
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:23 AM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ పి.భాస్కర్ రావు తెలిపారు.
ప్రజలకు పోలీస్ సేవలు
మరింత చేరువ కావాలనే ఫుట్ పెట్రోలింగ్
సెంట్రల్ జోన్ ఏసీపీ
పి.భాస్కర్ రావు
విజయవాడ క్రైమ్, ఫిబ్ర వరి 2: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ పి.భాస్కర్ రావు తెలిపారు. పటమటలంక, పటమట డొంకరోడ్డు, చేపల మార్కెట్ ఏరియాల్లో సెంట్రల్ జోన్ ఏసీపీ, పటమట పోలీసులు శుక్రవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులు అందించే సేవలను ప్రజలకు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారాన్ని తమకు అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు. అదే సమయంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి అటువంటి ప్రదేశాల్లో పెట్రోలింగ్ పెంచుతామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఫుట్ పెట్రోలింగ్‌లో జరుగుతున్న సమయంలో త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పటమట సీఐ డి.కె.ఎన్. మోహన్ రెడ్డి, ఎస్‌ఐలు కె.వి.జి.వి. సత్యనారాయణ, వై.వి.శాతకర్ణి, ఎస్.వల్లి పద్మ, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.