Share News

పోలీసులది పక్షపాత వైఖరి

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:21 AM

గన్నవరం పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి జరిగి వారం అవుతున్నా దర్యాప్తు పూర్తి చేయక పోవడం సరికాదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఆరోపించారు.

పోలీసులది పక్షపాత వైఖరి
గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న నిరసన దీక్షలో మాట్లాడుతున్న కొనకళ్ల నారాయణ

టీడీపీ నేత రంగబాబుపై దాడి జరిగి వారమైంది

ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదు: కొనకళ్ల నారాయణ

నిందితులను అరెస్టు చేయాలని యార్లగడ్డ ఆధ్వర్యంలో దీక్ష

సంఘీభావం తెలిపిన టీడీపీ, జనసేన నాయకులు

గన్నవరం, జనవరి 27: గన్నవరం పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి జరిగి వారం అవుతున్నా దర్యాప్తు పూర్తి చేయక పోవడం సరికాదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఆరోపించారు. బస్టాండ్‌ సమీపంలో రంగబాబుపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ప్రజల్లో ఉన్ననమ్మకాన్ని పోగోట్టుకోవద్దని పోలీసులకు ఆయన సూచించారు. ఎన్ని దాడులు జరిగినా, కేసులు పెట్టినా, జైలుకు పంపినా అదరకుండా నిలబడటం టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే సాధ్యమన్నారు. ‘‘పోలీసుల వైఖరి దుర్మార్గం. జిల్లా ఎస్పీ ఈ కేసు పట్ల బాధ్యతగా వ్యహరించడం లేదు. పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కారు నెంబర్‌తో టోల్‌గేట్‌ సీసీ పుటేజ్‌ ఆధారంగా కారులో ఎవరు ఉన్నారనేది తెలుసుకునే అవకాశమున్నా పోలీసు అధికారులు స్పందించడం లేదు. ప్రశాతంగా ఉండే గన్నవరం నియోజకవర్గంలో నాలుగేళ్లుగా దాడులు, కేసులు, ఆస్తుల ధ్వంసాలు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు శాంతిని కాపాడటంలో విఫలమయ్యారు.’’ అని యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో దీనిపై ప్రైవేటు కేసు వేస్తామన్నారు. సెక్షన్లు కూడా సరిగా పెట్టలేదన్నారు. ప్రజలు రోడ్డు ఎక్కక ముందే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ పని అయిపోయిందని, పెట్టే బెడా సర్దుకుని ఇంటికి పోయే సమయం వచ్చిందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. పోలీసు లను అడ్డుపెట్టుకుని ఈ దుర్మార్గుడు చేసిన అన్యా యాలు లెక్కలేవన్నారు. రంగబాబుపై దాడికి సంబం ధించి ఆధారాలు ఉన్నా చర్యలు ఎందుకు తీసుకో వడం లేదని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌ ప్రశ్నించారు. ఎస్పీ అసమర్థతా.. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. నిందితులను అరెస్టు చేయకపోగా ఎస్పీ దాడులను సమర్థిచడం దారుణమన్నారు. టీడీపీ, జనసేన నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు, గొడ్డళ్ల చిన్న రామారావు, ఆరుమళ్ల కృష్ణారెడ్డి, దయాల రాజేశ్వరరావు, చిరుమావిళ్ల సూర్యం, దొంతు చిన్న, ఆళ్ల గోపాలకృష్ణ, మూల్పూరి సాయికల్యాణి, మండవ లక్ష్మి, మేడేపల్లి రమాదేవి, గూడ వల్లి నర్సయ్య, గుండపనేని ఉమా వర ప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, పడమట రంగారావు, చిమటా రవివర్మ, మండవ రమ్యకృష,్ణ బోడపాటి రవి, జి.తులసీమోహన్‌ పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ?

గన్నవరం: గన్నవరం పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కాసనేని రంగబాబుపై జరిగిన దాడిలో పాల్గొన్న ఇద్దరు నిందితులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత ఆదివారం పొలం కావాలి చూపించ మంటూ వచ్చి గుర్తు తెలియని ఆరుగురు కలిసి రంగబాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన తెలిసిందే. గన్నవరం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వారు ఉపయోగించిన కారు, ఫోన్‌ నెంబర్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఐతే దాడి చేసినవారంతా హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఒక బృందం నెల్లూరు వైపు వెళ్లివచ్చింది. హైదరాబాద్‌ పాతబస్తీ కేంద్రంగా దర్యాప్తు చేయడంతో ఇద్దరు మాత్రమే దొరికారు. వీరిని ఎంత విచారించినా ఎవరో చెప్పారు. దాడి చేశామని మాత్రమే చెప్పినట్లు తెలి సింది. వాడిన కారు విజయవాడలో అద్దెకు తీసుకుని అప్పగించి మళ్లీ వెళ్లిపోయామని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఇంకా నలుగురు నిందితులు దొరకాల్సి ఉంది. వారి కోసం ఒక బృందం ముమ్మరంగా గాలిస్తు న్నట్లు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం పోలీసులు గోప్యంగా ఉంచడం, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడం గమనార్హం.

Updated Date - Jan 28 , 2024 | 01:21 AM