Share News

ఓటర్ల జాబితాలో సిత్రాలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:12 AM

నెలల తరబడి ఓటర్ల జాబితాలపై ఎన్నికల సం ఘం అధికారులు కసరత్తు చేసినా అంతి మంగా చాలా మంది ఓటర్లు తమ ఓటు ను కోల్పోయామని ఆందోళన చెందుతు న్నారు. ఎందుకు తొలగించారో తెలియ దని కొందరు, డోర్‌ నెంబర్లు, ఇతర తప్పుల తడకలు జాబితాలో ఉన్నాయని మరికొం దరు చెబుతున్నారు.

ఓటర్ల జాబితాలో సిత్రాలు
తన ఐడీ ప్రూఫ్‌లతో ఇంటి వద్ద రాధ గుంటూరు

ఓట్లు తొలగించారని కొందరు..తప్పుల తడకగా రూపొందించారని మరికొందరు ఓటర్ల ఆందోళన

భవానీపురం, జనవరి 28: నెలల తరబడి ఓటర్ల జాబితాలపై ఎన్నికల సం ఘం అధికారులు కసరత్తు చేసినా అంతి మంగా చాలా మంది ఓటర్లు తమ ఓటు ను కోల్పోయామని ఆందోళన చెందుతు న్నారు. ఎందుకు తొలగించారో తెలియ దని కొందరు, డోర్‌ నెంబర్లు, ఇతర తప్పుల తడకలు జాబితాలో ఉన్నాయని మరికొం దరు చెబుతున్నారు. 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాపతి కోటిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలోనే 30 ఏళ్ల నుంచి ఊర్మిళానగర్‌లో 76-17-198 డోర్‌ నెంబర్‌లో నివాసముంటున్న గుంటూరు రాధ పేరును ఓటర్ల జాబితాల్లోంచి తొలగించారు. ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యే ఎన్నికల్లోను యెండూరి రామలింగేశ్వ రరావు హైస్కూల్‌లో మూడేళ్ల క్రితం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సిద్ధం కృష్ణారెడ్డి ఎలిమెంటరీ పాఠశాలలో ఓటేశానని, ఇప్పుడు తన ఓటును ఎందుకు తొల గించారో తెలియదని చెబుతున్నారు. తాను ప్రజా సమస్యలపై గట్టిగా ప్రశ్ని స్తున్నానని తొలగించారేమోనని అంటున్నారు. 118వ పోలింగ్‌ బూత్‌ పరి ధిలో ఆమె ఓటు తొలగించిన జాబితాలో ఉంది. 76-17-199 డోర్‌ నెంబర్‌లో నివాసముంటున్న వెంకటనాని భాస్కర్‌ సముద్రాల జిల్లా పేరు మారడంతో తాజాగా ఓటర్ల జాబితాలో చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్డుపై అతని పుట్టిన తేదీ లేకుండా 32 ఏళ్ల వయస్సు అని ముద్రించారు. ఆమె తల్లి సుబ్బరత్నం డోర్‌ నెంబర్‌ వేరేదిగా ముద్రించారు. ఎన్నికల సంఘం ముద్రించిన ఓటర్‌ ఐడీ కార్డుల్లో తప్పులు దొర్లడంపై ఈ కార్డులను ఓటింగ్‌ సమయంలో అనుమ తిస్తారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Jan 29 , 2024 | 01:12 AM