Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

వైసీపీ కటౌట్లపై టీడీపీ నేత తండ్రి ఫొటో

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:00 AM

వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టుతో టీడీపీ నాయ కుడి తండ్రి ఫొటోను వైసీపీ కటౌట్లు, ఫ్లెక్సీలపై వేసు కోవడం ఏంటని టీడీపీ మచిలీపట్నం నగర అధ్య క్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా ధ్వజమెత్తారు.

వైసీపీ కటౌట్లపై టీడీపీ నేత తండ్రి ఫొటో
కోనేరు సెంటర్‌లో కటౌట్‌ వద్ద ధర్నా చేస్తున్న పిప్పళ్ల సూర్యప్రకాశరావు, టీడీపీ నాయకులు

కటౌట్లు తొలగించాలని కోనేరు సెంటర్‌లో టీడీపీ ధర్నా

మచిలీపట్నం టౌన్‌, మార్చి 2: వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టుతో టీడీపీ నాయ కుడి తండ్రి ఫొటోను వైసీపీ కటౌట్లు, ఫ్లెక్సీలపై వేసు కోవడం ఏంటని టీడీపీ మచిలీపట్నం నగర అధ్య క్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా ధ్వజమెత్తారు. టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు తండ్రి సూర్యప్రకాశరావు ఫొటోను కోనేరుసెంటర్‌, తది తర ప్రాంతాల్లో పెట్టిన వైసీపీ కటౌట్లు, ఫ్లెక్సీల్లో వేయడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం కోనేరుసెంటర్‌లో కటౌట్‌ వద్ద ధర్నా చేశారు. దానిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పిప్పళ్ల కాంతారావు, పిప్పళ్ల సూర్యప్రకాశరావు, కట్టా దుర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు.

వైసీపీలో ఎప్పుడు చేరావంటున్నారు

ఏడాది క్రితం పార్టీ పర్యటనలో భాగంగా మా ఇంటికి వైసీపీ మచిలీపట్నం అభ్యర్థి పేర్ని కిట్టు వచ్చారు. మేము టీ ఇస్తే కిట్టు తాగారు. ఆ సమయంలో నాతో కిట్టు మాట్లాడారు. నాకు తెలియకుండా ఫొటోలు తీశారు. నా అనుమతి లేకుండా నా ఫొటో ను నగరంలోని కోనేరుసెంటర్‌ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లపై వేశారు. వడ్డి రంగారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేను టీడీపీలో ఉన్నా. నా అనుమతి లేకుండా నా ఫొటో కటౌట్లలో ప్రచురించడం ఏంటి. ఈ కటౌట్‌ చూసి అందరూ వైసీపీలో ఎప్పుడు చేరావని అడుగుతున్నారు. కటౌట్లను వెంటనే తొలగించాలి.

- పిపళ్ల సూర్యప్రకాశరావు

Updated Date - Mar 03 , 2024 | 01:01 AM