Share News

ప్రజలు తిరగబడి తరిమి కొట్టారు

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:16 AM

ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో తిరుగుబాటు చేసి కూటమి అభ్యర్థులకు అత్యథిక మెజారిటీతో ఘనవిజయాన్ని ఇచ్చారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు.

ప్రజలు తిరగబడి తరిమి కొట్టారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 5 : ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో తిరుగుబాటు చేసి కూటమి అభ్యర్థులకు అత్యథిక మెజారిటీతో ఘనవిజయాన్ని ఇచ్చారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ, బీజేపీ కన్వీనర్‌ సోడిశెట్టి బాలాజీలతో కలిసి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయనని, మచిలీపట్నం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. మచిలీపట్నంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. మంగినపూడి బీచ్‌ను గోవా టూరిజం స్పాట్‌ చేస్తామన్నారు. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్ఫ్‌ యూనిట్‌ను మచిలీపట్నంలో నెలకొల్పుతామన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ, కొల్లు రవీంద్రకు చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కుతుందని, మచిలీపట్నంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవకాశాలు లభిస్తాయన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సోడిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. బండి రామకృష్ణ మాట్లాడుతూ, అభ్యర్థుల విజయానికి చిత్తశుద్ధితో అందరూ సమన్వయంతో పనిచేశారన్నారు. జనసేన నాయకులు మాదివాడ రాము, గడ్డం రాజు, మోటమర్రి బాబా ప్రసాద్‌, మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము, అన్నం ఆనంద్‌, దేరపల్లి అనిత, ఎండీ ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు, లంకే శేషగిరి, గోపు సత్యనారాయణ, గోకుల శివ, కరెడ్ల సుశీల, కుంచే నాని, వాలిశెట్టి తిరుమలరావు, లంకే హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 01:16 AM