Share News

జగన్‌పై ఓటుతో తిరుగుబాటుకు జనం సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 01:08 AM

ఓటుతో జగన్‌పై తిరుగుబాటుకు జనం సిద్ధంగా ఉన్నారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు.

జగన్‌పై ఓటుతో తిరుగుబాటుకు జనం సిద్ధం
పశ్చిమ నియోజకవర్గంలో రోడ్‌ షో చేస్తున్న కేశినేని చిన్ని, సుజనాచౌదరి, షా నవాజ్‌ హుస్సేన్‌, వంగవీటి రాధాకృష్ణ

ఎన్నికల ప్రచారంలో కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని

వన్‌టౌన్‌, మే 11: ఓటుతో జగన్‌పై తిరుగుబాటుకు జనం సిద్ధంగా ఉన్నారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన శని వారం భవానీపురంలో కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి షా నవాజ్‌ హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యే వంగ వీటి రాధాకృష్ణ, టీడీపీ నేతలు బుద్దావెంకన్న, నాగుల్‌మీరాతో కలిసి ఆయన ప్రచారం చేశారు. భవానీపురం, ఆర్టీసీ వర్క్‌షాప్‌ రోడ్డు, నియోజ కవర్గ పరిధిలో భారీ ర్యాలీ చేశారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా కూట మికి ఓటేసి ప్రజలు ఆశీర్వదించబోతున్నారని చిన్ని అన్నారు. మంచి చేస్తే ఓటు వేయాలని జగన్‌ అంటున్నారని, ఐదేళ్ల వైసీపీ పాలనంతా అవినీతి మయమని, మంచికి చోటే లేదని, దీంతో ప్రజలు ఓటుతో తిరుగుబాటు చేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. చైతన్యరథంపైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సుజనాచౌదరి, కేశినేని చిన్ని, నాయకులను గజమాలతో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా సత్కరించారు. ఇంద్రకీలాద్రిని అయోధ్య తరహాలో ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్పు చేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ముస్లింలకు హజ్‌ హౌస్‌ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీలకు చర్చిల నిర్మాణం, కొండ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తానని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్టీయే కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఎంఎస్‌ బేగ్‌, సోలంకి రాజు, అడ్డూరి శ్రీరామ్‌, బాడిత శంకర్‌, లిం గం శివప్రసాద్‌, బేసి కంఠేశ్వరరావు, పైలా సోమినాయుడు పాల్గొన్నారు.

ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు: కేశినేని చిన్ని

జగన్‌ గులకరాయి డ్రామా అట్టర్‌ఫ్లాప్‌: బొండా ఉమా

పాయకాపురం/అజిత్‌సింగ్‌నగర్‌: ఈ ఎన్నికలు వైసీపీకి, ఎన్డీయే కూటమికి మధ్య కాదు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగు తున్నాయని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) విమర్శించారు. కూటమి సెంట్రల్‌ నియో జకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి సెంట్రల్‌ నియోజకవర్గంలోని కండ్రిక కాలనీ, పైపులరోడ్డు, డాబాకొట్లు ప్రాంతాల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. సైకిల్‌ గుర్తుపై ఓట్లేసి ఎమెల్యేగా బొండా ఉమా, ఎంపీగా తనను గెలిపించాలని ఆయన కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అంతా విధ్వంసమే జరిగిందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరమో ప్రజలకు వివరించారు. విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో సామాన్యుల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రాధాన్యం ఇస్తానని చిన్ని హామీ ఇచ్చారు. జగన్‌, వెలంపల్లి ఆడిన గులకరాయి డ్రామా అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని బొండా ఉమా విమర్శించారు. అమాయకుల్ని ఇరికించి బలి చేయాలనుకున్నా రని, కానీ నిజం గెలిచి వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ అట్టర్‌ఫ్లాప్‌ కానుందని జగన్‌ను ఇంటికి పంపిం చడానికి ప్రజలు ఫిక్స్‌ అయిపోయారని అన్నారు. గొట్టుముక్కల రఘు రామరాజు, ఘంటా కృష్ణమోహన్‌, పరుచూరి ప్రసాద్‌, దాసరి కనకా రావు, పిరియా సోమేశ్వరరావు బొండా ఉమా కుమారులు బొండా సిద్ధార్థ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:08 AM