పేదల పెన్నిధి వీఎం రంగా
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:18 AM
పెన్నిధి వంగవీటి మోహనరంగా అని, ఆయన పేదల పక్షాన నిరంతర పోరాటాలు చేశారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

గుణదల, జూలై 4: పేదల పెన్నిధి వంగవీటి మోహనరంగా అని, ఆయన పేదల పక్షాన నిరంతర పోరాటాలు చేశారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రంగా జయంతి సందర్భంగా రామవరప్పా డులో వీఎం రంగా కాంస్య విగ్రహానికి గురువారం యార్లగడ్డ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అభిమానులు ఉన్న నాయకుడు వీఎం రంగా అని కొనియాడారు. టీడీపీ రామవరప్పాడు గ్రామ అధ్యక్షుడు నబిగాని కొండయ్య, పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్య క్షుడు గొడ్డళ్ల చిన్న రామారావు, సీనియర్ నాయకుడు కొల్లా ఆనంద్, అద్దేపల్లి సాంబశివనాగరాజు(సాంబు) పాల్గొన్నారు.