Share News

పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:54 AM

ఉదోగ్య, ఉపాధ్యా యులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ.25 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలి
అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్‌ నేతలు

కూచిపూడి, ఫిబ్రవరి 29: ఉదోగ్య, ఉపాధ్యా యులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బకాయిలు రూ.25 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం మొవ్వ తహ సీల్దార్‌ కార్యాలయం ఎదుట తమ సమస్యలు పరిష్క రించాలని ఏపీటీఎఫ్‌ నేతలు ధర్నా నిర్వహించారు. ‘‘అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చిన వైసీపీ ప్రభు త్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమ స్యలు పరిష్కరించటంలో జాప్యాన్ని ప్రదర్శిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పెట్టిన పెండింగ్‌ బకాయిలు వెం టనే విడుదల చేయాలి. జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాలి.’’ అని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ.వి.రామారావు డిమాండ్‌ చేశారు. కె.ఎన్‌.సోమేశ్వరమ్మ, బి.మాణిక్యాలరావు, జి.భగవాన్‌, కె.నాగరాజు, పి.దుర్గాప్రసాద్‌, ఎంఏ అబ్బాస్‌, వైవీ శ్రీకాంత్‌నాయక్‌ పాల్గొన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు.

అవనిగడ్డ: ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాలకు చెందిన ఏపీటీఎఫ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. 8 డిమాండ్లతో వినతిపత్రాన్ని తహసీల్దార్‌ కార్యాలయంలో అందజే శారు. ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.సాంబ శివరావు యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:54 AM