Share News

పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:25 AM

పేదల సంక్షేమ, అభివృద్ధి కోసం టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రవేశ పెట్టిందని పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా అన్నారు. పట్టణంలోని 15వార్డులో బుధవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యాక్రమం నిర్వహిం చారు. పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

 పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

పామర్రు, జనవరి 10 : పేదల సంక్షేమ, అభివృద్ధి కోసం టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రవేశ పెట్టిందని పామర్రు ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా అన్నారు. పట్టణంలోని 15వార్డులో బుధవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యాక్రమం నిర్వహిం చారు. పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

కూచిపూడి : చంద్రబాబును తిరిగి ముఖ్య మంత్రిని చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్‌ రాజా అన్నారు. అయ్యంకి గ్రామంలో బుధవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు లింగమనేని రామలిం గేశ్వరరావు, వీరంకి తులసీదాస్‌, రాజులపాటి పెద్ద మస్తాన్‌, రాజులపాటి వెంకటేశ్వరరావు, పామర్తి నాగయ్య, మురారి నాగరాజు పాల్గొన్నారు.

అవనిగడ్డ : రాష్ట్ర భవిష్యత్‌ బాగు పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ అన్నారు. అవనిగడ్డలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యం లో బుధవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్న జగన్‌ రెడ్డిని బటన్‌ నొక్కి తరిమేద్దామ న్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.

కోడూరు : రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు అన్నారు. పోటుమీద, రామకృష్ణాపురం గ్రామాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం బుధ వారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొక్కిలిగడ్డ జాన్‌ విల్సన్‌, బావిశెట్టి శ్రీనివాసరావు, ఉప్పల శివ నాగరాజు, గోగినేని సోమశేఖరరావు, మల్లిఖార్జునరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు : ఏ గ్రామంలో చూసిన సమస్యలే, ఎక్కడా అభివృద్ధి కనిపించటంలేదని గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము అన్నారు. చిత్రం, పెంజండ్ర గ్రామాల్లో బుధవారం బాబు ష్యూ రిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల నుంచి సమస్యలను రాము అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, నియోజకవర్గ జనసేన కన్వీనర్‌ బూరగడ్డ శ్రీకాంత్‌, బొప్పన శివ ప్రసాద్‌, మల్లా రామారావు, పోలవరపు వెంకటరావు, అడుసుమిల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 01:25 AM