Share News

దివిసీమకు పట్టిసీమ నీరు

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:54 AM

‘‘నీటిపారుదల రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం ఆక్విడెక్ట్‌ లాకులకు మరమ్మతులు కూడా చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెం టనే పట్టిసీమను పునరుద్దరించి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కల్లా పెండింగ్‌లో ఉన్న పను లన్నీ చేస్తాం.’’ అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ స్పష్టంచేశారు.

దివిసీమకు పట్టిసీమ నీరు
మోపిదేవి వార్పు వద్ద దివిసీమకు సాగునీటిని విడుదల చేస్తున్న మండలి బుద్దప్రసాద్‌

మోపిదేవి వార్పు వద్ద పూజలు చేసి గోదావరి జలాలు విడుదల చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

వైసీపీ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం

మోపిదేవి, జూలై 14: ‘‘నీటిపారుదల రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం ఆక్విడెక్ట్‌ లాకులకు మరమ్మతులు కూడా చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెం టనే పట్టిసీమను పునరుద్దరించి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కల్లా పెండింగ్‌లో ఉన్న పను లన్నీ చేస్తాం.’’ అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ స్పష్టంచేశారు. పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కెనాల్‌కు వచ్చిన గోదావరి జలా లను దివిసీమ ప్రాంతంలోని దిగువ ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాల కోసం ఆదివారం మోపిదేవివార్పు వద్ద పూజలు చేసి ఆయన విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దివిసీమ ప్రాంతానికి ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. కృష్ణాడెల్టాకు సాగు, తాగు నీటిని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దివిసీమలో చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లో గత ఏడాది పంటలు వేయక నాలుగువేల ఎకరాలు సాగు చేయలేదన్నారు. ప్రస్తుతం వాటిని సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసు కోకూడదనే టీడీపీ కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రతీ చేనుకు నీరు, ప్రతీ చేతికి పని నినాదంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆశయాల కనుగుణంగా పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాటన్‌ దొర విగ్రహానికి నివాళు లర్పించారు. ఇరిగేషన్‌ డీఈఈ రవికిరణ్‌, ఏఈలు పి.వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. జనార్దన్‌, జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాల రావు, బాసు నాంచారయ్యనాయుడు, పూషడపు రత్నగోపాల్‌, టీడీపీ నేతలు నడ కుదుటి జనార్దనరావు, మోర్ల రాంబాబు, బండే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:54 AM