పసుపర్తి కామేశ్వరశర్మ కన్నుమూత
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:57 AM
ఆధ్యాత్మిక ప్రవచనకర్త, శాస్త్ర, జ్యోతిష్య పండితుడు, విజయవాడ ఎలక్ర్టికల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పసు మర్తి కామేశ్వరశర్మ శనివారం తెల్లవారుజామున అయోధ్యనగర్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త
విజయవాడ లీగల్, జూలై 27: ఆధ్యాత్మిక ప్రవచనకర్త, శాస్త్ర, జ్యోతిష్య పండితుడు, విజయవాడ ఎలక్ర్టికల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పసు మర్తి కామేశ్వరశర్మ శనివారం తెల్లవారుజామున అయోధ్యనగర్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. శర్మకు భార్య రాజేశ్వరి, కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కామేశ్వరశర్మ సంస్కృతాంధ్ర సాహిత్యాలు, సంగీత జ్యోతిష్యాది శాస్ర్తాల్లో నిష్ణాతుడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రవచనాలు చెప్పేవారు. 2023 ఏప్రిల్ 16న సౌత్‌ఆఫ్రికా తెలుగు అసోసియేషన్, జయహో భారతీయం సంస్థలు ‘తెలుగు రత్న’ పురస్కారం ఇచ్చి శర్మను సత్కరించాయి. 30 ఏళ్లుగా ఉచితంగా అందరికీ జ్యోతిష్యం చెబుతున్నారు. చివరిగా ఈనెల 20వ తేదీన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనకు గురుపూజ చేసి ‘సద్గురు’ బిరుదుతో సత్కరించింది. ఆయన కుమారుడు అమెరికాలో ఉండడంతో అంత్యేష్టి కర్మలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. శర్మ పార్థివదేహానికి ఎమ్మెల్యే బొండా ఉమా శ్రద్ధాంజలి ఘటించారు. కామేశ్వర శర్మ లేని లోటు తీర్చ లేనిదని బెజవాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు కొత్త చంద్రమౌళి, అరిగల శివ రాంప్రసాద్(రాజా) అన్నారు. కామేశ్వరశర్మ మృతితో మధురవాక్కు మూగ బోయిందని సీఏం చంద్రబాబు సెక్రటరీ రాజమౌళి ఆవేదన వ్యక్తంచేశారు. రాశిఫలాలు ఆయనంత మధురంగా చెప్పడం తానెక్కడా చూడలేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.