Share News

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:25 AM

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఎన్‌ ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మధుశ్రీ అన్నారు. ఎనికేపాడు విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్స్‌ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహా రాలు, క్రీడామంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వరల్డ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ డేను బుధవారం నిర్వహించారు.

 పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

ఎనికేపాడు(గన్నవరం), జూన్‌ 5 : పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఎన్‌ ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ మధుశ్రీ అన్నారు. ఎనికేపాడు విజయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఉమెన్స్‌ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహా రాలు, క్రీడామంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వరల్డ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ డేను బుధవారం నిర్వహించారు. విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా డాక్టర్‌ మధుశ్రీ మాట్లాడుతూ, అంతరించి పోతున్న వృక్షజాతిని కాపాడుకో వాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. భవిష్యత్‌తరాలకు ఆహ్లాదకరమైన వాతా వరణాన్ని అందించాలంటే మొక్కలు నాటాలన్నారు. నెహ్రూ యువకేంద్రం జిల్లా యూత్‌ ఆఫీసర్‌ సుంకర రాము, బి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, సైకిల్‌ విని యోగం ద్వారా వాయుకాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలునాటి సంరక్షించాలి

కాటూరు(ఉయ్యూరు) : ప్రతిఒక్కరూ మొక్కలునాటి సంరక్షించడం బాధ్యతగా గుర్తెరిగి పర్యావరణ పరిరక్షణలో భాగాస్వాములు కావాలని గుడివాడ డీవైఈవో పద్మారాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం కాటూరు జిల్లా పరిష త్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో పాటు చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడంవల్ల పర్యావరణానికి కలిగే అనర్ధాలు తెలియజేసి పర్యావరణ పరి రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల తల్లిదండ్రులు, సమాజా నికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాసైన్స్‌ ఆఫీసర్‌ జాకీర్‌ అహ్మద్‌, పాఠశాల హెచ్‌ఎం తలశిల రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేసీపీ కర్మాగారంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు.

Updated Date - Jun 06 , 2024 | 08:49 AM