Share News

కానుమోలు ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో పంచకర్మ చికిత్సలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:05 AM

ఆయుర్వేద చికిత్సా విధానంలో పంచకర్మ చికిత్స ముఖ్యమైనదని, దీంతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగు తుందని డాక్టర్‌ వాహిని తెలి పారు.

కానుమోలు ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో పంచకర్మ చికిత్సలు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూలై 4: ఆయుర్వేద చికిత్సా విధానంలో పంచకర్మ చికిత్స ముఖ్యమైనదని, దీంతో దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగు తుందని డాక్టర్‌ వాహిని తెలి పారు. కానుమోలు ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో గురువారం నుంచి పంచకర్మ చికిత్సలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆమె పేర్కొన్నారు. వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని వ్యాధి తీవ్రత మేరకు 7రోజులు పంచకర్మ చికిత్స చేస్తామని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వాహిని సూచించారు.

Updated Date - Jul 05 , 2024 | 01:05 AM