పల్లె ప్రగతికి తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:06 AM
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొం దించినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నా రు. అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత నిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
గన్నవరం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొం దించినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నా రు. అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత నిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మండలంలో తెంపల్లి, వీరపనేనిగూడెం, కొత్తగూ డెం, గొల్లనపల్లి, మాదలవారిగూడెం, సూరంపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, వీఎన్‌పురం కాలనీ, దావాజీగూడెం, బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లి, జక్కులనెక్కలం గ్రామాల్లో రూ.6.16 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు పల్లె పండుగలో భాగంగా ఆది వారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు వడ్రాణం హరిబాబు నాయుడు, చిరుమామిళ్ల సూ ర్యం, దొంతు చిన్న, జొన్నలగడ్డ రంగమ్మ, ఆరు మళ్ల కృష్ణారెడ్డి, కొండేటి వెంకటేశ్వరరావు, గొల్లన పల్లి సర్పంచ్ గణపవరపు శాంతి, యనమదల సతీష్, రామినీడు బసవ పూర్ణయ్య, సూరంపల్లి సర్పంచ్ ఈలప్రోలు వాసు, గొట్టిపూళ్ల వీరబాబు, దేవరపల్లి కోటేశ్వరరావు, మం డవ అన్వేష్, మేడేపల్లి రమ, శ్రీనాధ్ పాల్గొన్నారు.