పాలనలో ప్రభుత్వ విఫలం
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:19 AM
వైసీపీ పాలనలో రాష్ర్టాన్ని బ్రష్టుపట్టించారని టీడీపీ పెనమలూరు ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యూరు 8వ వార్డులో సోమవారం పర్యటించి బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి వైసీపీపై ధ్వజ మెత్తారు.
ఉయ్యూరు, ఫిబ్రవరి 5 : వైసీపీ పాలనలో రాష్ర్టాన్ని బ్రష్టుపట్టించారని టీడీపీ పెనమలూరు ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉయ్యూరు 8వ వార్డులో సోమవారం పర్యటించి బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి వైసీపీపై ధ్వజ మెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉయ్యూరులో పేదలకు బహుళ అం తస్తుల్లో టిడ్కో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించి మూడొంతుల పనులు పూర్తిచేస్తే వైసీపీ వాటిని పాడుపెట్టిందని ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం యువతకు ఉద్యోగా లు, ఉపాఽధి కల్పించేలా చర్యలు తీసుకుంటుంద న్నారు. మాజీ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు, ఖుద్దూస్, కౌన్సిలర్ సుధారాణి, సంగెపు రంగారావు, ఈడే అంజిబాబు, జయదేవ్, అప్పలనాయుడు, నాగరాజు, నరేశ్, చిరంజీవి, అర్జునరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివ పాల్గొన్నారు.
రానున్నది రామరాజ్యమే..
కంకిపాడు : రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమే అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి హేమ అన్నారు. మండలంలోని కోలవెన్నులో సోమవారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ విధి విధానాలతో ప్రజ లు విసుగెత్తిపోయారన్నారు. రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమే అని అది చంద్రబాబుతోనే సాధ్యమ న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల పల్లి హరికృష్ణ, జగదీష్, మూల్పూరి కల్యాణి, తట్టుకూరి సురేష్, ఇమ్మానుయేలు, కొండా నాగేశ్వర రావు, వెంకటరమణ, కంచర్ల మోహన్ పాలడుగు సత్యనారాయణ, కుమార్, లాం ఆనంద్, వడ్డేపల్లి దిలీప్, ప్రసాద్, కాటూరి ప్రమోద్ పాల్గొన్నారు.
ఫతెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు దేవినేని గౌతమ్ అన్నారు. మారేడుమాకలో నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగాధర్‌రావు, రామ్, పండు, నాని పాల్గొన్నారు.
ఫతెన్నేరులో సోమవారం నిర్వహించిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడు బోడె వెంకట్ రామ్‌తో పాటు ఉద్దండి కుటుంబరావు, జె. నాని, యార్లగడ్డ రాజా, లంకా నాగబాబు, ఆర్ గంగాధర్, ఎన్ మన్మధరావు, కె. కిషోర్, యలమంద, యార్లగడ్డ మధుసూదనరావు, దండమూడి లక్ష్మీ, కొడాలి సాయి బాబు, కె. ప్రతాప్, కె. పండు పాల్గొన్నారు.
అన్ని వ్యవస్థలు పతనం..
పెనమలూరు : నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ సైకో జగన్‌రెడ్డి పతనం చేశాడని టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ కార్యదర్శి మొక్కపాటి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం యనమలకుదురు 53, 54 బూత్‌ల పరిధిలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. ఒక్క చాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సైకో జగన్‌రెడ్డి బూటకపు బటన్ నొక్కుళ్లతో ఇంతకాలం కాలక్షేపం చేశాడని ఎద్దేవా చేశారు. ఇసుక, బుసక, అక్రమ మైనింగ్, నాసిరకం మద్యం ఇలా అన్ని రంగాల్లో అవినీతి ఏరులై పారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుబ్బు, బలగం కొండ, షేక్ షాహీనా తదితరులు పాల్గొన్నారు.