ఓటమి భయంతో కారుకూతలు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:58 AM
రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కారుకూతలు కూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యూరు 7, 9 వార్డులో జనసేన నాయకులతో కలసి ఆదివారం ఇంటింటా ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తరు వాత అమలు జరిపే సంక్షేమ పథకాలతో మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు కలిగే ప్రయోజ నాలు వివరించారు. చంద్రబాబును నమ్మవద్దని మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రమేశ్‌పై దుమ్మెత్తి పోశారు.
మంత్రి జోగి రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపాటు
ఉయ్యూరు, జనవరి 28 : రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కారుకూతలు కూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యూరు 7, 9 వార్డులో జనసేన నాయకులతో కలసి ఆదివారం ఇంటింటా ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన తరు వాత అమలు జరిపే సంక్షేమ పథకాలతో మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు కలిగే ప్రయోజ నాలు వివరించారు. చంద్రబాబును నమ్మవద్దని మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రమేశ్‌పై దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిని ఎందుకు నమ్మి తిరిగి వైసీపీని గెలిపించాలని ప్రశ్నించారు. ఉచిత ఇసుక విధానం రద్దుచేసి దోచుకుతిన్నందుకు జగన్ ను నమ్మాలా, మద్యనిషేధం చేస్తానన్న హామీ గాలికొదిలి, నకిలీ మద్యంతో వేలాది మంది ప్రాణాలు తీసి మహిళల తాళిబొట్లు తెంచినందుకు నమ్మాలా అని దుయ్య బట్టారు. వైసీపీకి నియోజకవర్గాల్లో నిలిపేందుకు ఎవరూ అభ్య ర్థులు లేక ఎక్కడెక్కడి వారినో మార్చుకుంటున్నారని విమర్శిం చారు. సంస్కారంలేని వ్యక్తిని తీసుకురావడంతో పెనమలూ రు నియోజకవర్గానికి గ్రహణం పట్టిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన కలసి ఎన్నికలకు వస్తుంటే మతిపోయి వైసీపీ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారని హేళన చేశారు. ఈ సందర్భం గా పట్టణంలో టీడీపీ, జనసేన కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. కాపుల రామాలయం సెంటర్‌లో వీఎం రంగా విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళు లర్పించారు. నాయకులకు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి కూనప రెడ్డి వాసు, మాజీ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు, ఖుద్దూస్, పార్టీ నాయ కులు గుర్నాధరావు, నాగరాజు, పలియాల శ్రీని వాసరావు, జంపాన అర్జునరావు, శ్రీనివాసరావు, మీసాల అప్పల నాయుడు, చిరంజీవి, కుటుంబరావు, నరేశ్, సంగెపు రంగారావు, దండమూడి చౌదరి, బాలాజీ, బాబు, జనసేన నాయకులు కార్తీకేయ, మేరుగ చినకోటయ్య, జరుగు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమరానికి సిద్ధంకండి
కంకిపాడు : ఎన్నికల సమరానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధం కావాలని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండల పార్టీ కార్యాలయంలో కంకిపాడు క్లస్టర్ బూత్ లెవల్ కమిటీ సభ్యులకు బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపిచంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ, ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే నిబద్ధత కలిగిన కార్యకర్తలు, నాయకులు, బూత్ లెవల్ సభ్యులు పటిష్టంగా ఉన్నారన్నారు. ఎన్నికల సమ యంలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ నుంచి ఓటర్లను ఓటు వేయించే బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉంటుంద న్నారు. వెయ్యి ఓటర్లకు ఒక సోల్జర్‌ను ఏర్పాటు చేసి ఎన్నిక లకు వెళ్లేందుకు కార్యచరణ రూపొందించుకోవడం జరిగిం దని తెలియజేశారు. న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లను టీడీపీకి ఓటు వేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు క్లస్టర్ ఇన్‌చార్జి, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, టీడీపీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, స్థానిక బూత్ కమిటీ ఇన్‌చార్జీలు పులి శ్రీనివాసరావు, గోగి నేని వెంకరమణ, చలవాది రాజా, పుట్టగుంట రవి, షేక్ షకార్, పందిపాటి సుఽధాకర్, అన్నవరపు శివపార్వతి, వణుకూరు విక్రం, షేక్ బాజి, ఏనుగ జయ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలకు కొండంత అండగా ఉంటానని పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాబూ ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో 90 శాతం పూర్తి చేసిన మాజీ ఎంపీటీసీ కొండా నాగేశ్వరరావును తుమ్మలపల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీం ద్ర, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపీచంద్, పులి శ్రీనివాసరావు, గోగినేని వెంకటరమణ, చలవాది రాజ, ఏనుగ జయప్రకాష్, షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు.