Share News

మరోసారీ

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:07 AM

అంతన్నారు.. ఇంతన్నారు.. ఎన్నికల ముందు వరాల బడ్జెట్‌ అంటూ డప్పు కొట్టారు.. చివరికి ఎలక్షన్‌ ఇయర్‌లోనూ ఆంధ్రాకు చిల్లర కూడా విదల్చకుండా ఉత్త చెయ్యి చూపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఈసారి కూడా అమరావతికి మొండిచేయే చూపారు. విభజన హామీలపై ప్రస్తావన లేకపోవడం రాజధాని ప్రాంతవాసులను నిరాశకు గురిచేసింది. రాజధానివాసుల చిరకాల వాంఛ అయిన అమరావతి రైల్వేట్రాక్‌ను ఈసారీ అటకెక్కించారు.

మరోసారీ

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ అమరావతికి మొండిచెయ్యే..

ఎన్నికల వత్సరంలోనూ పైసా కేటాయింపుల్లేవ్‌..

రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల స్వరం ఫలితమే..

బెజవాడ మెట్రో రైలు ఊసెత్తని కేంద్రం

అమరావతి రైల్వేట్రాక్‌ అటకెక్కినట్టే..

రైల్వేకు అత్తెసరు కేటాయింపులు

విజయవాడ-గూడూరుకు నాల్గో లైన్‌ మంజూరు

విజయవాడ-విశాఖ మార్గంలో మూడు, నాలుగు లైన్లు

కొత్త రైళ్ల మాట లేదు.. ప్రాజెక్టుల ఊసూ లేదు..

అంతన్నారు.. ఇంతన్నారు.. ఎన్నికల ముందు వరాల బడ్జెట్‌ అంటూ డప్పు కొట్టారు.. చివరికి ఎలక్షన్‌ ఇయర్‌లోనూ ఆంధ్రాకు చిల్లర కూడా విదల్చకుండా ఉత్త చెయ్యి చూపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఈసారి కూడా అమరావతికి మొండిచేయే చూపారు. విభజన హామీలపై ప్రస్తావన లేకపోవడం రాజధాని ప్రాంతవాసులను నిరాశకు గురిచేసింది. రాజధానివాసుల చిరకాల వాంఛ అయిన అమరావతి రైల్వేట్రాక్‌ను ఈసారీ అటకెక్కించారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతిని అనుసంధానించేలా 106 కిలోమీటర్ల మేర నూతన రైల్వేలైన్‌ నిర్మాణానికి రూ.3,272 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపినా 2019 నుంచి ఏ బడ్జెట్‌లోనూ దాని ఊసెత్తలేదు. ఇక విజయవాడ మెట్రో రైలు కథ కూడా కంచికి చేరింది. విజయవాడ-గూడూరు నాల్గో లైన్‌ను మంజూరు చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. విజయవాడ-విశాఖపట్నం మార్గంలో మూడు, నాల్గో లైన్లను కూడా కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తూ మూడు రాజధానుల స్వరం అందుకోవడంతో అమరావతి రైలు, మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్రం దృష్టిపెట్టడమే మానేసింది. వేతన జీవులకు పన్ను విధానాల్లో ఊరట కలిగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవు తోంది. - విజయవాడ, ఆంధ్రజ్యోతి/మచిలీపట్నం టౌన్‌

Updated Date - Feb 02 , 2024 | 01:07 AM