Share News

రసాయన, జీవరసాయన విధానాలపై నేడు, రేపు సమావేశం

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:10 AM

ఆధునిక వ్యాధులకు వ్యతిరేకంగా, లక్ష్యాల అభివృద్ధి కోసం రసాయన, జీవరసాయన విధానాలపై ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల అంతర్జాతీ య సమావేశం నిర్వహి స్తున్నట్లు సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన తెలిపారు.

రసాయన, జీవరసాయన విధానాలపై   నేడు, రేపు సమావేశం

రసాయన, జీవరసాయన విధానాలపై

నేడు, రేపు సమావేశం

లబ్బీపేట, ఫిబ్రవరి 27: ఆధునిక వ్యాధులకు వ్యతిరేకంగా, లక్ష్యాల అభివృద్ధి కోసం రసాయన, జీవరసాయన విధానాలపై ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల అంతర్జాతీ య సమావేశం నిర్వహి స్తున్నట్లు సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన తెలిపారు. కళాశాలలో బుధవారం సమావేశం బ్రోచర్‌ను కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల జీవ రసాయన శాస్త్రం, రసాయన శాస్త్రం విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కృష్ణాయూనివర్సిటీ కెమిస్ర్టీ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ అండ్‌ డీన్‌ డాక్టర్‌ డి.రామశేఖర రెడ్డి, ప్రధాన వక్తగా యూకేకు చెందిన బయో ఫార్మ్‌ క్లినికల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సేతురామ్‌ కావేరిలు పాల్గొంటారని తెలిపారు. సిద్ధార్థ అకాడమి ప్రెసిడెంట్‌ సి.నాగేశ్వరరావు, సెక్రటరీ పి.లక్ష్మణరావు, జాయింట్‌ సెక్రటరీ ఎన్‌.లలిత ప్రసాద్‌, ట్రెజరర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు. కళాశాల అధ్యాపకులు ఎ.హారిక, ఎం.సుభాషిణి, ఎ.పల్లవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:10 AM