Share News

ఇసుక దొంగలకు అధికారుల వత్తాసు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:59 AM

‘‘రొయ్యూరు, చోడవరంలో రేయింబవళ్లు ఇసుక దందా జరుగుతోంది. జాతీయ గ్రీన్‌ ట్రైబున్యల్‌ ఆదేశాలను అధికారులు లెక్కచేయడం లేదు. అధికార యంత్రాంగం ఇసుక దొంగలకు వత్తాసు పలుకుతోంది. ఇది దారుణం.’’ అని టీడీపీ బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకటగురుమూర్తి ఆరోపించారు.

ఇసుక దొంగలకు అధికారుల వత్తాసు

టీడీపీ నేత వీరంకి వెంకట గురుమూర్తి ఆరోపణ

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 14: ‘‘రొయ్యూరు, చోడవరంలో రేయింబవళ్లు ఇసుక దందా జరుగుతోంది. జాతీయ గ్రీన్‌ ట్రైబున్యల్‌ ఆదేశాలను అధికారులు లెక్కచేయడం లేదు. అధికార యంత్రాంగం ఇసుక దొంగలకు వత్తాసు పలుకుతోంది. ఇది దారుణం.’’ అని టీడీపీ బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకటగురుమూర్తి ఆరోపించారు. తోట్లవల్లూరులోని తన నివాసం వద్ద బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పుడో మూతపడిన క్వారీ వద్దకు కలెక్టర్‌ను తీసుకెళ్లి జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు తప్పుడు నివేదికలు పంపిస్తారా? కలెక్టర్‌ను కూడా తప్పుదోవ పట్టించారంటే అవినీతి, అక్రమాలకు అధికారులు ఎంతగా కొమ్ముకాస్తున్నారో అర్థమవుతోందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పథకం ఉంటే అవినీతి, అక్రమాలు జరిగాయని గగ్గోలు పెట్టిన వైసీపీ నాయకులు ఇపుడు జరుగుతున్న ఇసుక దారుణాలపై ఏమి సమాధానం చెపుతారని గురుమూర్తి ప్రశ్నించారు.

Updated Date - Feb 15 , 2024 | 12:59 AM