Share News

దుర్గమ్మకు కలువపూల అర్చన

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:19 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వ హిస్తున్న ప్రత్యేక పుష్పార్చనల్లో 4వ రోజైన శుక్రవారం దుర్గమ్మను కలువలతో, మరువంతో అర్చకులు విశేషంగా అర్చించారు.

దుర్గమ్మకు కలువపూల అర్చన
కలువలతో అమ్మవారికి అర్చన చేస్తున్న అర్చకులు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వ హిస్తున్న ప్రత్యేక పుష్పార్చనల్లో 4వ రోజైన శుక్రవారం దుర్గమ్మను కలువలతో, మరువంతో అర్చకులు విశేషంగా అర్చించారు. హారతి, మంత్రపుష్పం కార్యక్రమంలో ఈవో కేఎస్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, ఏఈవో రమేష్‌ బాబు సిబ్బందితో కలిసి కలువపూలు, మరువం ఉన్న బుట్టలను మేళ తాళాల మధ్య ఈవో వేదిక వద్దకు తెచ్చారు. సంకల్పం అనంతరం లలితా సహస్రనామం అనుసంధానంతో అమ్మవారికి కలువలు, మరువం సమర్పించారు.

Updated Date - Apr 13 , 2024 | 01:19 AM