Share News

ఎటు చూసినా చెత్తే..

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:55 AM

తాడిగడప మునిసిపాలిటీలో ఏమూల చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని కానూరు, యనమలకుదురు, పోరంకి, తాడిగడప క్లస్టర్లలో చెత్త కుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోతూ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి.

ఎటు చూసినా చెత్తే..
పోరంకిలో పేరుకుపోయిన చెత్త కుప్పలు

పెనమలూరు, ఫిబ్రవరి 27: తాడిగడప మునిసిపాలిటీలో ఏమూల చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. మునిసిపాలిటీ పరిధిలోని కానూరు, యనమలకుదురు, పోరంకి, తాడిగడప క్లస్టర్లలో చెత్త కుప్పలు ఎక్కడికక్కడ పేరుకుపోతూ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. వాటివల్ల వచ్చే దుర్గంధంతో పాటు పెచ్చరిల్లుతున్న దోమలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. దోమల నివారణకు మునిసిపల్‌ అధికారులు కనీసం ఫాగింగ్‌ కూడా చేపట్టకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా కానూరులో పారిశుధ్యం అటకెక్కింది. మునిసిపాలిటీ అధికారులు అసలు ప్రజల బాధలను పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. మునిసిపాలిటీల్లో పారిశుధ్యానికి కేటాయిస్తున్న నిధులను ఖర్చు పెట్టడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో వారి నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. గత నెల రోజులుగా దోమలు, ఇతర క్రిమి కీటకాల విజృంభణతో ఆసుపత్రుల పాలవుతున్న అమాయక ప్రజల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తాడిగడప మునిసిపాలిటీలో చెత్త కుప్పలను నివారించి ప్రజలను సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడాలని స్థానికుల కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:55 AM