Share News

నియంత పాలనకు చరమగీతం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:08 AM

రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించటం ద్వారా వైసీపీ ప్రభుత్వ నియంత పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు. మండలంలోని చాగంటిపాడు, నంద మూరు గ్రామాల్లో శనివారం గ్రామ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ ఆయా గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసే ఆరు పథకాల గురించి ప్రజలకు వివరించారు.

నియంత పాలనకు చరమగీతం
నందమూరులో మహిళల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న యార్లగడ్డ వెంకట్రావు

ఉంగుటూరు, ఫిబ్రవరి 24 : రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించటం ద్వారా వైసీపీ ప్రభుత్వ నియంత పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు. మండలంలోని చాగంటిపాడు, నంద మూరు గ్రామాల్లో శనివారం గ్రామ పార్టీ కమిటీల ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ ఆయా గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసే ఆరు పథకాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా గ్రామాల్లో వున్న సమస్యలను అడిగి తెలుసుకుని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా సమ స్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యం గా యువతకు ఉపాధి కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైదన్నారు.

మట్టిమాఫియాలో మొదటిస్థానం

మట్టిమాఫియాలో రాష్ట్రంలోనే గన్నవరం నియో జకవర్గం మొదటిస్థానంలో వుందని యార్లగడ్డ విమ ర్శించారు. అధికారపార్టీ నాయకులు ఇష్టాను సారంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో వున్న చెరువులు, వాగులు, వంకలను వదలకుండా అక్రమ మట్టి తవ్వకాలు నిర్వ హిస్తూ అందినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకోసం పేదప్ర జలను ఇబ్బందులకు గురిచేస్తూ నియంత పరిపాలన కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, జనసేన పార్టీ అధ్యక్షుడు బర్మా భాస్కర్‌, మండవ రమ్య, మేడేపల్లి రమా, షేక్‌ అహ్మద్‌ ఫకీర్‌, గుడ్డేటి పోతురాజు, సుంకర రమేష్‌, మండవ ప్రసాద్‌, సాయిబాబు, సుంకర శ్రీను, అనగాని సురేష్‌, జంపా నాగమల్లేశ్వరరావు, పసుపులేటి సుబ్బారావు, జంపా నాగరమేష్‌ సోమిశెట్టి లక్ష్మణస్వామి, పసుపులేటి లక్ష్మీనారాయణ, జంపా మహేష్‌, పసుపులేటి కిషోర్‌, గుండప నేని నాని, మున్నా, రామకృష్ణ, గోగినేని విష్ణు, కొలుసు రవీంద్ర, ఇందుపల్లి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

పొణుకుమాడులో పూజలు

మండల పరిధిలోని పొణుకుమాడులో గంగాపార్వతీ సమేత రాజేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో జీవధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన హోమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వర్ణ నాంచారే శ్వరశర్మ స్వామివారి శేషవస్త్రంతోపాటు దివ్య ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరు మళ్ల వెంకట కృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, షేక్‌ అహ్మద్‌ ఫకీర్‌, కె.సాంబయ్య, ఆళ్ల సత్యనారాయణ, జోషి కుమార్‌, మాజీ సర్పంచ్‌ గుండపనేని నాని, మున్నా, రామకృష్ణ, తేలు సత్యనారాయణ, చల్లగుళ్ల షణ్ముఖ్‌, పసుమర్తి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:08 AM