జేసీగా నిధి మీనా
ABN , Publish Date - Jul 21 , 2024 | 01:18 AM
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. నూతన జేసీగా 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి నిధి మీనాను ప్రభుత్వం నియమించింది.
విజయవాడ మునిసిపల్ కమిషనర్‌గా ధ్యానచంద్ర
సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా మల్లవరపు నవీన్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. నూతన జేసీగా 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి నిధి మీనాను ప్రభుత్వం నియమించింది. సంపత్ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నూతన జేసీగా వస్తున్న నిధి మీనా 2020 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం వయోజన విద్య డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నిధి మీనా డాక్టర్ కూడా. రాజస్థాన్‌కు చెందిన ఆమె ఎంబీబీఎస్ చదివారు.
ఇక విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) కమిషనర్‌గా హెచ్‌ఎం ధ్యానచంద్రను ప్రభుత్వం నియమించింది. ఈయన ఇంతకుముందు ఉమ్మడి కృష్ణాజిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కర్ణాటకకు చెందిన ఈయన 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలుగు సినిమాలంటే ఇష్టం. సినిమాలు చూస్తూ తెలుగు నేర్చుకున్నారు. డాక్టర్ అయిన ధ్యానచంద్ర ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. కరోనా సమయంలో విజయవాడ సబ్ కలెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా మల్లవరపు నవీన్‌ను ప్రభుత్వం నియమించింది. నవీన్ 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా పనిచేసిన కట్టా సింహాచలం బదిలీ అయిన నేపథ్యంలో నవీన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. కట్టా సింహాచలానికి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది.