నిడమానూరు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించండి
ABN , Publish Date - Jul 27 , 2024 | 01:18 AM
మహానాడు జం క్షన్ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పను లు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కేశినేని చిన్ని వినతి
వన్‌టౌన్: మహానాడు జం క్షన్ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పను లు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు. ఫ్లై ఓవర్ నిర్మాణంపై ఢిల్లీలో గడ్కరీని చిన్ని కలిశారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంఽ దించిన వివరాలతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈనెలాఖరు కల్లా డీపీఆర్ సమర్పించేలా జాతీయ రహదారుల సంస్థను ఆదేశించాలని కోరారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చిన్నికి గడ్కరీ హామీ ఇచ్చారు.