నిబంధనాలు!
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:54 AM
గన్నవరం గ్రామ పంచాయతీ లో పారిశుధ్య కార్మికుల టెండర్‌ల విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. టెండర్‌ల విషయంలో లేనిపోని నిబంధనలు పెట్టి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే వ్యవహా రానికి తెరతీసిన పరిస్థితి నుంచి టెండర్ షెడ్యూలుకు సంబంధించి అధికారులు పెట్టిన నిబంధనలు పరి శీలిస్తే..

ఫ కష్టం ఎక్కువ.. వేతనాలు తక్కువ
ఫ 95 మంది కార్మికుల జీవితాలతో పంచాయతీ అధికారుల ఆటలు
ఫ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఏకపక్ష నిర్ణయాలు
ఫ ఆందోళనలో గన్నవరం పంచాయతీ కార్మికులు
గన్నవరం, మార్చి 5 : గన్నవరం గ్రామ పంచాయతీ లో పారిశుధ్య కార్మికుల టెండర్‌ల విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. టెండర్‌ల విషయంలో లేనిపోని నిబంధనలు పెట్టి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే వ్యవహా రానికి తెరతీసిన పరిస్థితి నుంచి టెండర్ షెడ్యూలుకు సంబంధించి అధికారులు పెట్టిన నిబంధనలు పరి శీలిస్తే.. 2024-25 సంవత్సరానికి పారిశుధ్య కార్మికులు 53మంది, నీటి సరఫరా, వీధి దీపాల రిపేరు నిర్వాహణకు 43మంది మొత్తం 96మంది పంచాయతీలో పనిచేస్తున్నారు. వీరం దరి పనులకు మంగళవారం టెండర్‌లు వేయాల్సి వచ్చింది. అయితే కార్మికులు వేతనాలు పెంచమని అడిగినందుకు పంచాయితీ అధికారులు కొత్త నిబంధనలు సృష్టించి సంతకాలు పెట్టమని పత్రాలు ఇవ్వటంతో వాటిని చూసిన కార్మికులు విస్తుపోయారు. పత్రంలో నిబంధనలు చూస్తే జిల్లాలో ఏ పంచాయతీలో ఇటువంటి నిబంధనలు లేవని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం పంచాయతీ పెట్టిన నిబంధనలు పరిశీలిస్తే.. కార్యదర్శికి ఈ క్రింది తెలిపిన షరతులకు లోబడి టెండరు దాఖలు చేయాలి. టెండరు డిపాజిట్ ముందుగా రూ.500 చెల్లిం చాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ చెప్పిన పనులన్నింటిని చేయాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అధికారులు సూచించిన సమయంలో మాత్రమే పని చేయాలి. టైముకు రాకుంటే ఆప్సెంట్ వేయబడుతుంది. ఆదివారం, పండుగ రోజులలో కూడా పనిచేయాలి. ఏరోజైనా రాకపోతే ఆరోజుకు టెండర్ రేటు ప్రకారం కూలి ఇవ్వబడదు. దాఖలు చేయ బడిన టెండరుపై అధికారులు ఆమోదించి, ప్రతిఫలం ఇచ్చుటకు అనుమతి ఉత్తర్వుల ప్రకారం కూలి ఇవ్వబడును. పనిని సక్రమంగా చేయకపోతే వెంటనే తొలగిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే పంచా యతీకి ఎటువంటి బాధ్యత ఉండదు. యూనిఫాం, పాద రక్షలు, కొబ్బరనూనె టెండరుదారే స్వయంగా సమకూ ర్చుకోవాలంటూ తదితర నిబంధనలు పెట్టారు. దీంతో కార్మికులు ఎన్నడూ లేని నిబంధనలు ఇప్పుడెందుకు పెడు తున్నారంటూ మండిపడుతున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టి కార్మికులను వేధించ టమేనని వాపోతున్నారు. కార్మికులతో పంచాయతీ పనులే కాకుండా ఇతర పనులు చేయించుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. చాలా నిర్లక్ష్యంగా, ఏకపక్షంగా టెండర్ కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని బెదిరింపులకు దిగిన పరిస్థితికి అధికార ులు వచ్చారని కార్మికులు చెబుతున్నారు.